TS Weather Updates : ఎండల నుంచి ఉపశమనం..! తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, హైదరాబాద్ లో మాత్రం ‘వేడి’ పరిస్థితులే!
- Telangana Weather Updates : తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించేలా.. ఐఎండీ చల్లనికబురు చెప్పింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana Weather Updates : తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించేలా.. ఐఎండీ చల్లనికబురు చెప్పింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. (/unsplash.com/)
(2 / 6)
ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది. రేపట్నుంచి(ఏప్రిల్ 7) రాష్ట్రవ్యాప్తంగ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.(/unsplash.com/)
(3 / 6)
ఏప్రిల్ 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ మేరకు తాజా బులెటిన్ ను విడుదల చేసింది.(/unsplash.com/)
(4 / 6)
ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (IMD Rain Alert)అక్కడకక్కడ కురిసే(Rains in Telangana) అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 8వ తేదీన పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. గాలి వేగం గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. (/unsplash.com/)
(5 / 6)
ఏప్రిల్ 09, 10వ తేదీల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో వివరించింది.(/unsplash.com/)
ఇతర గ్యాలరీలు