వయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుస్తారా?
- ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ అడుగుపెడుతున్నారు. సోదరుడు రాహుల్ గాంధీకి చెందిన కేరళ వయనాడ్ నుంచి బరిలో దిగనున్నారు.
- ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ అడుగుపెడుతున్నారు. సోదరుడు రాహుల్ గాంధీకి చెందిన కేరళ వయనాడ్ నుంచి బరిలో దిగనున్నారు.
(1 / 5)
2019లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎలక్షన్స్‌లో పాల్గొనలేదు. 2022 యూపీ అసెంబ్లీలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో (రాయ్‌బరేలీ) ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం అవ్వలేదు.
(HT_PRINT)(2 / 5)
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలిచారు. రాజ్యాంగం ప్రకారం.. ఒక ఎంపీకి రెండు సీట్లు ఉండకూడదు. అందుకే ఆ రెండింట్లో ఆయన ఒకటి త్యాగం చేయాల్సి వచ్చింది.
(PTI)(3 / 5)
రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీని ఉంచుకుని, వయనాడ్‌ని వదులుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ సీటులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగాయి. వాటిని నిజం చేస్తూ.. సోమవరం ఓ ప్రకటన వెలువడింది.
(ANI)(4 / 5)
ఎన్నికల ఫైట్‌లోకి ఎంట్రీపై బోల్డ్‌గా స్పందించారు ప్రియాంక గాంధీ. "లడ్కీ హూ- లడ్ సక్తీ హూ (అమ్మాయిని, పోరాడగలను)" అని తన నినాదాన్ని చెబుతూ.. తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
(PTI)ఇతర గ్యాలరీలు