తెలుగు న్యూస్ / ఫోటో /
Pak vs Eng 3rd Test: స్వదేశంలో సిరీస్ విజయంపై కన్నేసిన పాకిస్థాన్.. మూడో టెస్టులోనూ ఓటమి దిశగా ఇంగ్లండ్
- Pak vs Eng 3rd Test: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్వదేశంలో చాలా రోజుల తర్వాత ఓ టెస్ట్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులోనూ గెలుపు ముంగిట ఉన్న ఆ టీమ్.. సిరీస్ ను 2-1తో సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- Pak vs Eng 3rd Test: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్వదేశంలో చాలా రోజుల తర్వాత ఓ టెస్ట్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులోనూ గెలుపు ముంగిట ఉన్న ఆ టీమ్.. సిరీస్ ను 2-1తో సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
(1 / 5)
Pak vs Eng 3rd Test: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులోనూ పాకిస్థాన్ విజయం ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కేవలం 267 రన్స్ కే ఆలౌట్ కాగా.. పాకిస్థాన్ 344 రన్స్ చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ టీమ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 24 రన్స్ చేసింది. ఇంకా 53 పరుగులు వెనుకబడే ఉండటంతో పాక్ మూడో టెస్టు విజయంపై కన్నేసింది.(AP)
(2 / 5)
Pak vs Eng 3rd Test: మూడు టెస్టుల సిరీస్ తొలి టెస్టులోనే ఇంగ్లండ్ విజయం సాధించగా.. అనూహ్యంగా రెండో టెస్టులో పుంజుకున్న పాకిస్థాన్ ఆ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో టెస్టులోనూ రెండో మ్యాచ్ విజయానికి కారణమైన సాజిద్ ఖాన్, నోమల్ అలీ చెలరేగుతున్నారు. స్పిన్ ఆడటానికి ఇంగ్లండ్ కిందామీదా పడుతోంది. దీంతో మూడో రోజే ఈ మ్యాచ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి.(AFP)
(3 / 5)
Pak vs Eng 3rd Test: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో పాక్ బౌలర్ సాజిద్ ఖాన్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్ లోనూ ఒక వికెట్ తీశాడు. ఇక నౌమన్ అలీ తొలి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ ఇద్దరు స్పిన్నర్ల ధాటికి మూడో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లోనూ కుప్పకూలే పరిస్థితి ఉంది. అదే జరిగితే మూడు టెస్టుల సిరీస్ ను పాకిస్థాన్ 2-1తో సొంతం చేసుకుంటుంది.(AFP)
(4 / 5)
Pak vs Eng 3rd Test: పాకిస్థాన్ తో తొలి టెస్టులోనే భారీ స్కోరుతో విరుచుకుపడిన ఇంగ్లండ్.. తర్వాత స్పిన్ పిచ్ ల ధాటికి నిలవలేకపోతోంది. రెండో టెస్టుతోపాటు ఇప్పుడు మూడో టెస్టులోనూ స్పిన్నర్ల హవా నడుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న మూడో టెస్టులో అయితే రెండు రోజుల్లోనే 23 వికెట్లు నేలకూలడం విశేషం.(AP)
(5 / 5)
Pak vs Eng 3rd Test: ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో ఇంకా 53 పరుగులు వెనుకబడే ఉంది. పాకిస్థాన్ స్పిన్నర్లు జోరు మీదున్నారు. దీంతో ఇంగ్లండ్ మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయడం అంత సులువు కాదు. ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కినా.. మొత్తంగా ఓటమి నుంచి మాత్రం తప్పించుకునే అవకాశాలు కనిపించడం లేదు.(AP)
ఇతర గ్యాలరీలు