(1 / 6)
Pakistan vs England 1st Test: పాకిస్థాన్ తో ముల్తాన్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కేవలం 310 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ కావడం విశేషం. అతడు మొత్తంగా 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్ లతో 317 రన్స్ చేసి ఔటయ్యాడు.
(REUTERS)(2 / 6)
Pakistan vs England 1st Test: మరో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కూడా డబుల్ సెంచరీ చేశాడు. అతడు 375 బంతుల్లో 17 ఫోర్లతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్టుల్లో ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీల రికార్డు అందుకున్న రూట్.. తన రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు.
(REUTERS)(3 / 6)
Pakistan vs England 1st Test: హ్యారీ బ్రూక్, జో రూట్ పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 453 పరుగులు జోడించడం విశేషం. ఈ ఇద్దరి జోరుతో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 823 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ కు 267 పరుగుల ఆధిక్యం లభించింది.
(AP)(4 / 6)
Pakistan vs England 1st Test: ముల్తాన్ టెస్టులో హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేశాడు. 2019లో పాకిస్థాన్ పైనే డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత మళ్లీ ఐదేళ్లకు టెస్టు క్రికెట్ లో మరో ట్రిపుల్ నమోదు చేసిన ఘనత బ్రూక్ కు దక్కింది.
(AP)(5 / 6)
Pakistan vs England 1st Test: ముల్తాన్ టెస్టు మూడో రోజు ఆటలో టెస్టుల్లో 35వ సెంచరీ చేసి గవాస్కర్ ను అధిగమించిన జో రూట్.. నాలుగో రోజు దానిని డబుల్ సెంచరీగా మలిచాడు.
(AFP)(6 / 6)
Pakistan vs England 1st Test: ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. మొత్తంగా ఇంగ్లండ్ టీమ్ 150 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో పాక్ బౌలర్లు పూర్తిగా అలసిపోయారు. ఆ టీమ్ స్టార్ పేస్ బౌలర్ అయిన అఫ్రిది 26 ఓవర్లలో 120 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీసుకున్నాడు.
(AFP)ఇతర గ్యాలరీలు