తెలుగు న్యూస్ / ఫోటో /
Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో అరుదైన ఘనత సొంతం
- Babar Azam World Record: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో అతడు ఈ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.
- Babar Azam World Record: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో అతడు ఈ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.
(1 / 7)
Babar Azam World Record: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ ఓడిపోయినా.. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యక్తిగతంలో ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. దాదాపుగా థర్డ్ రేటెడ్ టీమ్ గా ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో పాక్ ను చిత్తు చేసింది.
(2 / 7)
Babar Azam World Record: ఈ మూడో టీ20లో బాబర్ ఆజం 29 బంతుల్లో 37 రన్స్ చేశాడు. దీంతో అతడు టీ20ల్లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ బాబర్ ఆజం 67 ఇన్నింగ్స్ లో 2246 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
(3 / 7)
Babar Azam World Record: బాబర్ ఆజం కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20ల్లో కెప్టెన్ గా 76 ఇన్నింగ్స్ లో 2236 రన్స్ చేశాడు. ఇప్పుడా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు.
(4 / 7)
Babar Azam World Record: ఈ లిస్టులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు టీ20ల్లో కెప్టెన్ గా 71 ఇన్నింగ్స్ లో 2125 రన్స్ చేశాడు.
(5 / 7)
Babar Azam World Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో కెప్టెన్ గా 54 ఇన్నింగ్స్ లో 1648 రన్స్ చేశాడు. అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు.
(6 / 7)
Babar Azam World Record: మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 46 ఇన్నింగ్స్ లో 1570 రన్స్ తో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే కెప్టెన్ గా విరాట్ బ్యాటింగ్ సగటు మాత్రం పైనున్న నలుగురి కంటే మెరుగ్గా ఉండటం విశేషం.
ఇతర గ్యాలరీలు