తెలుగు న్యూస్ / ఫోటో /
Vasantha panchami: వసంత పంచమి రోజు పిల్లలతో ఇలా చేయిస్తే వాళ్ళు కెరీర్ లో అద్భుతంగా రాణిస్తారు
Saraswati Puja 2024 date: వసంత పంచమి రోజున పిల్లలతో కొన్ని ప్రత్యేకమైన పనిని చేయించినప్పుడు వారు కెరీర్ లో విజయం సాధిస్తారు. మాట్లాడంతో ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. తెలివితేటలు పెరుగుతాయి.
(1 / 7)
వసంత పంచమి పండుగ 14 ఫిబ్రవరి 2024న జరుపుకుంటారు. సరస్వతీ దేవి మాఘమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున జన్మించింది. తల్లి సరస్వతి ఆశీస్సుల ద్వారానే ప్రజలు జ్ఞానం, వాక్కు, కళ జ్ఞానాన్ని పొందుతారు.
(2 / 7)
సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే కళ, సంగీతం, విద్యా రంగాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారని నమ్ముతారు. గ్రంధాల ప్రకారం వసంత పంచమి నాడు కొన్ని ప్రత్యేక పనులు చేయాలి, ముఖ్యంగా పిల్లలు ఇలా చేయడం ద్వారా సరస్వతీ దేవి జీవితాంతం వారి మీద దయ చూపుతుంది. వృత్తిలో ప్రయోజనాలు పొందుతారు.
(3 / 7)
వసంత పంచమి నాడు పిల్లలతో ఈ విధంగా చేయించండి. చదువుపై ఆసక్తి లేకుండా పదేపదే పరధ్యానంలో ఉన్న పిల్లలతో వసంత పంచమి నాడు సరస్వతీ దేవి పూజ చేయించాలి. తల్లి తన బిడ్డ చేతితో సరస్వతికి పసుపు పూలు, పండ్లు, బెల్లం వేసిన అన్నం సమర్పించాలి. ఇలా చేస్తే సరస్వతీ దేవిని ప్రసన్నం అవుతుంది. పిల్లల మేధో అభివృద్ధి జరుగుతుంది. పిల్లల మీద అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. చదువులో బాగా రాణిస్తారు.
(4 / 7)
ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో పిల్లలు అంతగా ఆసక్తి చూపించరు. అటువంటి సందర్భంలో తన లక్ష్యం కోసం పోరాడేందుకు స్పూర్తినిస్తూ పిల్లల రీడింగ్ టేబుల్ దగ్గర సరస్వతి మాత చిత్రాన్ని ఉంచండి. అది వారికి చదువుపై ఆసక్తిని పెంచుతుంది.
(5 / 7)
చదువుకున్నప్పటికీ సరిగా మాట్లాడటం లేదా రాయడంలో ఇబ్బంది ఉన్న పిల్లలకు వసంత పంచమి నాడు వెండి పెన్నును తేనెలో ముంచి పిల్లల నాలుకపై ఓం రాయండి. ఇది ప్రసంగ సమస్యలను నయం చేస్తుందని నమ్ముతారు. ఇక వారి వాక్ ధాటి ముందు ఎవరూ నిలబడలేరు. (Freepik)
(6 / 7)
విద్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్న విద్యార్థులు వసంత పంచమి నాడు సరస్వతికి తెల్ల చందనం సమర్పించి, ఓం ఔం సరస్వత్య ఔం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల కెరీర్‌లో విజయం సాధిస్తారని నమ్మకం. (Freepik)
ఇతర గ్యాలరీలు