తెలుగు న్యూస్ / ఫోటో /
NYC Flooding: జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం
NYC Flooding: అమెరికాలోని న్యూయార్క్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సబ్ వే ల్లోకి, విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. నగరంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని మేయర్ హెచ్చరించారు.
(1 / 5)
న్యూయార్క్ లో ప్రజా రవాణాకు ప్రాణాధారమైన సబ్ వే సిస్టమ్ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. సబ్ వేల్లోకి వరద నీరు చేరింది. కనాటికట్, న్యూజెర్సీ, లాంగ్ ఐలండ్ ల్లోనూ వరద ఉదృతి ఉంది.(REUTERS)
(2 / 5)
మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. (Getty Images via AFP)
(3 / 5)
న్యూయార్క్ నగరంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నగరాలను కలిపే రహదారులు కొన్ని తెగిపోయాయి. న్యూయార్క్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. (AP)
(4 / 5)
న్యూయార్క్ లో జలమయమైన ఒక రహదారి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.(AP)
ఇతర గ్యాలరీలు