NSG1 Status For Vja Station: విజయవాడ రైల్వే స్టేషన్‌కు NSG-1 హోదా..దేశంలో ఎలైట్ స్టేషన్ హోదా
- NSG1 Status : విజయవాడ రైల్వే స్టేషన్‌కు NSG-1 హోదా, భారతదేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్‌లో చేరింది రైల్వే బోర్డు నిర్వహించిన తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయంలో ₹500 కోట్ల మార్కును అధిగమించి, నాన్ సబర్బన్ గ్రూప్ (NSG)-1 కేటగిరీ హోదాను పొందడం ద్వారా చరిత్ర సృష్టించింది.
- NSG1 Status : విజయవాడ రైల్వే స్టేషన్‌కు NSG-1 హోదా, భారతదేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్‌లో చేరింది రైల్వే బోర్డు నిర్వహించిన తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయంలో ₹500 కోట్ల మార్కును అధిగమించి, నాన్ సబర్బన్ గ్రూప్ (NSG)-1 కేటగిరీ హోదాను పొందడం ద్వారా చరిత్ర సృష్టించింది.
(1 / 8)
విజయవాడ రైల్వే జంక్షన్‌కు ఎలైట్ హోదా లభించింది. ఏటా 2కోట్ల మంది ప్రయాణికులు, రూ5.00 కోట్ల ఆదాయంతో ఎన్‌ఎస్‌జీ-1 హోదాను దక్కించుకుంది.
(2 / 8)
2017-18లో ప్రవేశపెట్టిన కొత్త వర్గీకరణ విధానంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం, 20 మిలియన్ల బయటి ప్రయాణీకులు రాకపోకలు కలిగి ఉన్న స్టేషన్‌కు NSG-1 హోదాతో గుర్తించారు. విజయవాడ రైల్వే స్టేషన్ 2017-18లో రెండు ప్రమాణాలలో కొద్ది వ్యత్యాసంలో ర్యాంకింగ్ కోల్పోయింది. NSG-2 హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
(3 / 8)
ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే విజయవాడను దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఒకటిగా ఎన్‌ఎస్‌జీ 1 హోదా నిలిపింది, వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా విజయవాడ స్థానాన్ని పటిష్టం చేసింది.
(4 / 8)
5 సంవత్సరాల తర్వాత నిర్వహించిన 2023-24 సమీక్షలో విజయవాడ స్టేషన్‌లో అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 2023-24లో దాదాపు 16.84 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసింది, ఇది NSG-1 ప్రమాణాలను మించిపోయింది, విజయవాడ వ్యూహాత్మక స్థానంగా గుర్తింపు పొందడంతో పాటు ప్రయాణికులతో రద్దీగా ఉండే కార్యకలాపాలకు అద్దం పట్టింది.
(5 / 8)
దక్షిణ మధ్య రైల్వే (SCR)లో సికింద్రాబాద్ తర్వాత NSG-1 హోదా సాధించిన రెండవ స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. ఉత్తమసేవలు, ప్రయాణికుల సంతృప్తితో మెరుగైన ఫలితాలు సాధింాచరు. భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ & తూర్పు భాగాలకు భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంగా విజయవాడ ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకదానితో మరొకటి అనుసంధానానికి గేట్‌వేగా విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌లలో ఒకటిగా ఘనమైన చరిత్ర విజయవాడకు ఉంది.
(6 / 8)
విజయవాడ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ దాదాపు 250 ప్యాసింజర్ రైళ్లు (రోజువారీ రైళ్లు, వారానికోసారి నడిచేవి) మరియు దాదాపు 70 గూడ్స్ రైళ్లను విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
(7 / 8)
విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల అవసరాలను తీర్చేలా కనీస సౌకర్యాలు, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా విస్తృత శ్రేణి ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని అన్ని టెర్మినల్స్‌లో లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు, చక్రాల కుర్చీ సౌకర్యాలు ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవలతో కూడిన “దివ్యాంగ్ జన్ ఫ్రెండ్లీ స్టేషన్”.లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.
ఇతర గ్యాలరీలు