తెలుగు న్యూస్ / ఫోటో /
WTC Point Table: డబ్ల్యూటీసీ పట్టికలో బారీగా పతనమైన న్యూజిలాండ్.. దుమ్మురేపిన శ్రీలంక.. భారత్ అదే ప్లేస్‍లో..
- WTC Point Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ దిగజారింది. శ్రీలంకతో సిరీస్ ఓటమి తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. భారత్ టాప్‍లో కొనసాగింది. పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఎలా ఉందంటే..
- WTC Point Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ దిగజారింది. శ్రీలంకతో సిరీస్ ఓటమి తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. భారత్ టాప్‍లో కొనసాగింది. పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఎలా ఉందంటే..
(1 / 6)
న్యూజిలాండ్‍పై టెస్టు సిరీస్‍ను 2-0తో కైవసం చేసుకొని శ్రీలంక అదరగొట్టింది. స్వదేశంలో జరిగిన సిరీస్‍ను క్లీన్‍స్వీప్ చేసింది. ఓటమి పాలైన న్యూజిలాండ్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారింది.
(2 / 6)
కివీస్‍పై సిరీస్ గెలిచిన శ్రీలంక ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (డబ్యూటీసీ) 202-25 పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రెండో ప్లేస్‍లోని ఆస్ట్రేలియాను సమీపిస్తోంది. 55.6 శాతం, 60 పాయింట్లతో ప్రస్తుతం (సెప్టెంబర్ 29) మూడో స్థానంలో ఉంది శ్రీలంక.
(3 / 6)
శ్రీలంక చేతిలో సిరీస్ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడు స్థానాలు పడిపోయింది. సిరీస్‍కు ముందు నాలుగో ప్లేస్‍లో ఉన్న న్యూజిలాండ్.. ఇప్పుడు ఏకంగా ఏడో స్థానానికి పతనమైంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍లు ఆడిన కివీస్ ప్రస్తుతం 37.50 పాయింట్ల శాతం, 36 పాయింట్లతో ఏడో ఏడో స్థానానికి పడింది.
(4 / 6)
డబ్ల్యూటీసీ 2020-25 సైకిల్ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ప్లేస్‍లో కొనసాగింది. ఇటీవలే బంగ్లాతో తొలి టెస్టులోనూ భారీగా గెలిచింది. ఈ సైకిల్‍లో ఇప్పటి వరకు 10 టెస్టులు ఆడిన భారత్ 86 పాయింట్లు, 71.96 విజయాల శాతంతో టాప్‍లో ఉంది. ఆస్ట్రేలియా 90 పాయింట్లు, 62.50 శాతంతో రెండో ప్లేస్‍లో ప్రస్తుతం ఉంది.
(5 / 6)
శ్రీలంక మూడో ప్లేస్‍లో ఉండగా.. ప్రస్తుతం ఇంగ్లండ్ (42.19 శాతం, 81 పాయింట్లు) నాలుగో ప్లేస్‍కు ఎగబాకింది. బంగ్లాదేశ్ (39.29 శాతం, 33 పాయింట్లు) ఐదో ప్లేస్‍లో ఉంది. దక్షిణాఫ్రికా (38.89 శాతం, 28 పాయింట్లు) ఆరో ప్లేస్‍లో ఉండగా.. న్యూజిలాండ్ ఇప్పుడు ఏడో ప్లేస్‍కు పడింది.
ఇతర గ్యాలరీలు