Netflix Price | సబ్​స్క్రిప్షన్ ధరలు తగ్గించే యోచనలో నెట్​ఫ్లిక్స్.. కారణం అదే..-netflix plans to reduce prices with ads due to visitors declining ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Netflix Price | సబ్​స్క్రిప్షన్ ధరలు తగ్గించే యోచనలో నెట్​ఫ్లిక్స్.. కారణం అదే..

Netflix Price | సబ్​స్క్రిప్షన్ ధరలు తగ్గించే యోచనలో నెట్​ఫ్లిక్స్.. కారణం అదే..

Apr 21, 2022, 08:32 AM IST HT Telugu Desk
Apr 21, 2022, 08:32 AM , IST

కావాల్సినంత కంటెంట్, అధిక నాణ్యత నెట్‌ఫ్లిక్స్ సొంతం. కానీ దాని సబ్‌స్క్రిప్షన్ ఖర్చు మాత్రం గట్టిగానే ఉంటుంది. ఇతర ఓటీటీ సబ్​స్క్రిప్షన్స్​తో పోల్చితే.. నెట్​ఫ్లిక్స్​ ధరలు ఎక్కువే. అందుకే ఈ ప్లాట్​ఫామ్​కి సబ్​స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలోనే.. సబ్​స్క్రైబర్లను నిలుపుకోవడానికి నెట్​ఫ్లిక్స్ సంస్థ సబ్​స్క్రిప్షన్​ ఖర్చు తగ్గించాలని ప్రణాళికలు చేస్తుంది. 

నెట్​ఫ్లిక్స్ కన్నా తక్కువ ధరకే అమేజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ వంటి ఓటీటీలు యూజర్లకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ కారణం వల్లనే.. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు వేగంగా తగ్గిపోతున్నారు.

(1 / 6)

నెట్​ఫ్లిక్స్ కన్నా తక్కువ ధరకే అమేజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ వంటి ఓటీటీలు యూజర్లకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ కారణం వల్లనే.. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు వేగంగా తగ్గిపోతున్నారు.(AFP)

ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ల ధరను తగ్గించడానికి కొత్త ప్లాన్‌లు వేస్తుంది. అప్పుడప్పుడు కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలను ప్రసరించాలనే ఆలోచనలో ఉంది. 

(2 / 6)

ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ల ధరను తగ్గించడానికి కొత్త ప్లాన్‌లు వేస్తుంది. అప్పుడప్పుడు కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలను ప్రసరించాలనే ఆలోచనలో ఉంది. (ht telugu)

యూట్యూబ్​ లాగా ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించాలని నెట్​ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఖర్చులపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. 

(3 / 6)

యూట్యూబ్​ లాగా ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించాలని నెట్​ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఖర్చులపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. (REUTERS/Dado Ruvic)

జనవరి-మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ దాదాపు 2,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీంతో కంపెనీ షేర్లు 26 శాతం పతనమయ్యాయి. 2022-23లో నెట్‌ఫ్లిక్స్ 2 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

(4 / 6)

జనవరి-మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ దాదాపు 2,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీంతో కంపెనీ షేర్లు 26 శాతం పతనమయ్యాయి. 2022-23లో నెట్‌ఫ్లిక్స్ 2 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. (REUTERS/Dado Ruvic)

నెట్‌ఫ్లిక్స్ గత జనవరిలో నివేదించినట్లుగా.. భారతదేశంలో వ్యాపారం చేయడం చాలా సవాలుగా ఉంది. పైగా ఇప్పుడు పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, చౌకైన ఇంటర్నెట్ కారణంగా.. నెట్‌ఫ్లిక్స్ తన మార్కెట్ గురించి మరింత ఆందోళన చెందుతోంది. 

(5 / 6)

నెట్‌ఫ్లిక్స్ గత జనవరిలో నివేదించినట్లుగా.. భారతదేశంలో వ్యాపారం చేయడం చాలా సవాలుగా ఉంది. పైగా ఇప్పుడు పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, చౌకైన ఇంటర్నెట్ కారణంగా.. నెట్‌ఫ్లిక్స్ తన మార్కెట్ గురించి మరింత ఆందోళన చెందుతోంది. (REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు