(1 / 6)
Neeraj Chopra Diamond League: పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి రెండు వారాలు కూడా కాలేదు.. నీరజ్ చోప్రా అప్పుడే లౌసానె డైమండ్ లీగ్ లో పాల్గొన్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతడు.. పారిస్ నుంచి చికిత్స కోసం నేరుగా జర్మనీ వెళ్లాడు. అతడు లౌసానెలో మెరుగ్గా రాణించడం అనుమానమే అనుకుంటుండగా ఊహించినట్లే అతడు రెండో స్థానానికి పరిమితం అయ్యాడు.
(2 / 6)
Neeraj Chopra Diamond League: నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచినా అభిమానులను నిరాశ పరచలేదు. పారిస్ ఒలింపిక్స్ కంటే బెస్ట్ త్రోనే వేశాడు. నిజానికి మొదటి నాలుగు త్రోల తర్వాత అతడు కనీసం టాప్ 3లో కూడా కనిపించలేదు. కానీ చివరి త్రోతో అద్భుతం చేశాడు. సీజన్ బెస్ట్ త్రో వేశాడు.
(3 / 6)
Neeraj Chopra Diamond League: లౌసానె డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా మొదటి నాలుగు త్రోల తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ నిబంధనల ప్రకారం మొదటి ఐదు త్రోల తర్వాత టాప్ 3లో ఉన్న వాళ్లే ఆరో త్రో వేస్తారు. నీరజ్ మాత్రం మొదటి నాలుగు త్రోలను 82.10, 83.21, 83.13, 82.34 మీటర్ల దూరం వేశాడు.
(4 / 6)
Neeraj Chopra Diamond League: నీరజ్ తన ఐదో త్రోతో టాప్ 3లోకి దూసుకొచ్చాడు. ఈసారి అతడు 85.58 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అతనికి చివరి త్రో వేసే అవకాశం లభించింది. చివరి త్రోలో అతడు మరింత చెలరేగి ఏకంగా 89.49 మీటర్లు విసిరాడు. నిజానికి అతనికి సిల్వర్ మెడల్ సాధించి పెట్టిన త్రో 89.45 మీటర్లే. ఈసారి దానికి మించి సీజన్ బెస్ట్ త్రో విసిరాడు.
(5 / 6)
Neeraj Chopra Diamond League: నీరజ్ చోప్రా కెరీర్లో ఇది సెకండ్ బెస్ట్ త్రో. అతడు గతంలో 2022 స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ లో జావెలిన్ ను 89.94 మీటర్ల దూరం విసిరాడు. లౌసానె డైమండ్ లీగ్ లో నీరజ్ కంటే గ్రెనెడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లు విసిరి టాప్ లో నిలిచాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబెర్ 87.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.
(6 / 6)
Neeraj Chopra Diamond League: పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఈ డైమండ్ లీగ్ లో పాల్గొనలేదు. అర్షద్ ఒలింపిక్స్ ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు