తెలుగు న్యూస్ / ఫోటో /
Navratri picks: ఈ పండుగ సీజన్ లో ఈ స్టాక్స్ తో లాభాలు పొందండి..
Navratri picks: పండుగ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో స్టాక్ మార్కెట్లో లాభాలు అందించే 5 స్టాక్స్ వివరాలను క్రేవింగ్ ఆల్ఫా సంస్థ మేనేజర్, మార్కెట్ నిపుణుడు మయాంక్ వెల్లడించారు. ఆ స్టాక్స్ తో రానున్న ఆరు నెలల్లో కనీసం 35% లాభాలు గ్యారెంటీ అని చెబుతున్నారు. ఆ స్టాక్స్ వివరాలు మీ కోసం..
(1 / 5)
Metro Brands: పండుగ సీజన్ లో కొత్త పాదరక్షలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. పండుగ సందర్భంగా కొత్త డ్రెస్ లతో పాటు కొత్త చెప్పులు, కొత్త షూస్ కొంటూ ఉంటారు. అందువల్ల పాదరక్షల వ్యాపారంలో ఉన్న మెట్రో బ్రాండ్స్ షేర్స్ తో రానున్న ఆరు నెలల్లో కనీసం 35% రిటర్న్స్ ఖాయమని చెబుతున్నారు.
(2 / 5)
Amara Raja Batteries: అమర రాజా బ్యాటరీస్ రీప్లేస్ మెంట్ బ్యాటరీస్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. ఇది 40% పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. అమర రాజా బ్యాటరీస్ స్టాక్ ప్రస్తుతం 13.8x PE యొక్క ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌తో ట్రేడవుతోంది, రానున్న ఆరు నెలల్లో ఇది కనీసం 25% రిటర్న్స్ ఇస్తుందని అంచనా.(Hemant Mishra/ mint.)
(3 / 5)
PI Industries: ఎరువులు, పురుగుమందులను ఉత్పత్తి చేసే కంపెనీ పీ ఐ ఇండస్ట్రీస్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ల్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. సమీప భవిష్యత్తులో ఇది 30% వరకు రిటర్న్స్ ఇస్తుందని అంచనా.
(4 / 5)
eClerxG: బీపీఎస్ సర్వీస్ లో ఉన్న ఈ సంస్థ ఆరు నెలల వ్యవధిలో 35% లాభాలను అందించగల స్టాక్ ఇది. బీపీఎస్ సర్వీస్ లో ఉన్న ఈ సంస్థ గత 10 సంవత్సరాలుగా స్థిరంగా లాభాలను ఆర్జిస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలు దీనికి కస్టమర్లుగా ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు