(1 / 9)
నవరాత్రి ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి మొదలవబోతుంది. ఇది తొమ్మిది రోజులు కొనసాగుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. చాలామంది ఉపవాసాలు చేస్తారు. అయితే మొదటిసారి ఉపవాసం చేసేవారి కోసం.. ఆరోగ్యకరమైన మార్గంలో మీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని హ్యాపీగా మీ ఉపవాసాన్ని ఇలా ముగించండి.
(File Image (iStock))(2 / 9)
పండ్లు లేదా కూరగాయలతో తయారు చేసిన జ్యూస్‌తో మీ ఉపవాసాన్ని ముగించండి. 50% పండ్ల రసం కలిగి ఉంటే, మిగిలిన 50% కు నీరు కలపండి. మొత్తం ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
(File Image (Pixabay))(3 / 9)
మీ ఉపవాసం తర్వాత చక్కెర, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ మానుకోండి
(Unsplash)(4 / 9)
మీ ఉపవాస ముగించే సమయంలో మీకు పండ్లు ఉంటే, మీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి మీరు ఆకుకూరలను ఉపయోగించి సలాడ్‌ను తయారు చేసుకోవచ్చు.
(Unsplash)(5 / 9)
ఉపవాసం విరమించేటప్పుడు హెవీగా తినకండి. ప్రతి రెండు లేదా మూడు గంటలకు తేలికగా తినండి.
(Unsplash)(6 / 9)
కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుళ్లు వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినండి.
(Unsplash)(7 / 9)
ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అయితే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి.
(Pixabay)(8 / 9)
రోజుల తరబడి ఉపవాసం ఉన్న తర్వాత, మీ శరీరం ఈ సాధారణ ఆహారాలకు అలవాటు పడిపోతుంది. కాబట్టి పాల ఉత్పత్తులు, మాంసాహార ఆహారాలను మీ ఆహారంలో నెమ్మదిగా చేర్చండి.
(Unsplash)(9 / 9)
వేయించిన, అధిక కేలరీల ఆహారాలతో మీ ఉపవాసాన్ని బ్రేక్ చేయవద్దు. ఇది మీ జీర్ణ కదలికలకు ఆటంకం కలిగిస్తుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు