Nail Care Tips : గోళ్లు తరచూ విరిగిపోతున్నాయా? అయితే ఇలా కాపాడుకోండి..-nail care tips learn how to make it easy way to grow nails at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nail Care Tips : గోళ్లు తరచూ విరిగిపోతున్నాయా? అయితే ఇలా కాపాడుకోండి..

Nail Care Tips : గోళ్లు తరచూ విరిగిపోతున్నాయా? అయితే ఇలా కాపాడుకోండి..

Jun 11, 2022, 03:46 PM IST Geddam Vijaya Madhuri
Jun 11, 2022, 03:46 PM , IST

గోళ్లు అందంగా లేకుంటే చేతులకు ఎన్ని అలంకరించినా.. అన్ని వృథానే. అయితే కోరుకున్నప్పటికీ కొందరు గోళ్లను పెంచుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొంచెం గోళ్లు పెంచినా అవి విరిగిపోతూ ఉంటాయి. మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే.. వెంటనే ఈ చిట్కాలు పాటించండి. 

చేతులతో పాటు గోళ్లపై మాయిశ్చరైజర్ రాయండి. గ్లైసిన్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, టైరోసిన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే మాయిశ్చరైజర్లను ఈ సందర్భంలో ఉపయోగించవచ్చు. గోళ్ల చుట్టూ ఉండే క్యూటికల్స్‌పై మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.

(1 / 6)

చేతులకు ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకోకండి. వాటిలో ఉండే రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒక వారం నెయిల్ పాలిష్‌ని ఉపయోగిస్తే.. తర్వాత కనీసం 2-3 రోజులు వాటిని ఖాళీగా ఉంచండి.

(2 / 6)

చేతి తొడుగులు ధరించండి. బట్టలు ఉతికేటప్పుడు, చెట్లు నాటే సమయంలో మీరు తప్పనిసరిగా చేతి తొడుగులు ధరించాలి. రాత్రి పడుకునే ముందు బాదం నూనె, ఆలివ్ నూనెతో మసాజ్ చేయండి. 

(3 / 6)

గోళ్లు తేలికగా విరిగిపోయే వారు.. గోళ్లు మరీ పెద్దవిగా పెంచుకోకండి. బదులుగా, అది చిన్నగా ఉన్నప్పుడే వాటికి మంచి షేప్ ఇవ్వండి. అప్పుడు గోళ్లు విరిగిపోయే సమస్యనుంచి బయటపడవచ్చు.

(4 / 6)

ఇవే కాకుండా తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. మీ ఆహారంలో తగినంత ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం ఉండేలా చూసుకోండి. నీరు పుష్కలంగా తాగండి. నీళ్లు తాగడం వల్ల శరీరం తేమగా ఉంటుంది, గోళ్లు పొడిబారకుండా ఉంటాయి.

(5 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు