MS Dhoni: ధోనీ దగ్గర ఉన్న ఖరీదైన కార్లు, బైకులను ఎప్పుడైనా చూశారా?
- MS Dhoni: ధోనీ అంటే ఓ సూపర్ హ్యూమన్ కెప్టెనే కాదు.. ఖరీదైన కార్లు, బైకులను ఇష్టపడే వ్యక్తి కూడా. రాంచీలోని అతని ఇంట్లో ఉన్న గ్యారేజీలో ఎన్నో వింటేజ్, లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. అందులో ఫెరారీ నుంచి హమ్మర్ వరకూ ఉండటం విశేషం.
- MS Dhoni: ధోనీ అంటే ఓ సూపర్ హ్యూమన్ కెప్టెనే కాదు.. ఖరీదైన కార్లు, బైకులను ఇష్టపడే వ్యక్తి కూడా. రాంచీలోని అతని ఇంట్లో ఉన్న గ్యారేజీలో ఎన్నో వింటేజ్, లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. అందులో ఫెరారీ నుంచి హమ్మర్ వరకూ ఉండటం విశేషం.
(1 / 8)
తన దగ్గర ఉన్న వింటేజ్ కారుతో ధోనీ సెల్ఫీ ఇది. అతని దగ్గర ఇలాంటి వింటేజ్ లతోపాటు ఫెరారీ, హమ్మర్, జీఎంసీ సియెరాలాంటి ఖరీదైన ఫోర్ వీలర్ కార్లు ఉండటం విశేషం.
(MS Dhoni on Instagram)(2 / 8)
ఇది ధోనీ దగ్గర ఉన్న కవాసకీ నింజా హెచ్2 బైక్. ఇది 2017 మోడల్. దీని ధర ఇండియాలో రూ.23 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఉండటం విశేషం. ఈ బైక్ ఫొటోను అతడు తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేశాడు
(MS Dhoni on Instagram)(3 / 8)
ధోనీ దగ్గర ఉన్న వింటేజ్ బైకులలో ఇదీ ఒకటి. దీని పేరు నార్టన్ జూబ్లీ 250. దీని ఇంజిన్ కెపాసిటీ 250 సీసీ. ఈ బైకులను 1958 నుంచి 1966 మధ్య యూకేలో తయారు చేశారు.
(MS Dhoni on Instagram)(4 / 8)
ధోనీ దగ్గర కవాసకీ, నార్టన్ వింటేజ్ బైకులే కాకుండా కాన్ఫెడరేట్ హెల్ కాట్, బీఎస్ఏ, సుజుకీ హయబుసాలాంటి ఇతర ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి.
(MS Dhoni on Instagram)(5 / 8)
ఇది ధోనీ దగ్గర ఉన్న పోర్షె 718 బాక్స్ స్టర్ కారు. ఇదే కాదు పోర్షె కంపెనీకే చెందిన 911 కారు కూడా అతని గ్యారేజీలో ఉంది. ఈ కారు ధర ఇండియాలో రూ.1.7 కోట్ల నుంచి రూ.3.08 కోట్ల వరకూ ఉంది.
(Porsche India )(6 / 8)
1960లనాటి మోడిఫై చేసిన నిస్సాన్ వన్ టాన్/4W73 వెహికిల్ కూడా ధోనీ గ్యారేజీలో ఉంది. ఈ కారును ముచ్చటపడి కొన్న ధోనీ దీనికి తాను కోరుకున్న మార్పులను చేసుకున్నాడు.
(MS Dhoni Instagram)(7 / 8)
ఈ కాన్ఫడెరేట్ ఎక్స్132 హెల్ కాట్ బైకు ధర సుమారు రూ.50 లక్షలు. ఈ బైకు కొన్ని ఏకైక ఆగ్నేయ ఆసియా వ్యక్తి ధోనీ మాత్రమే అని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ప్రపంచంలోని అరుదైన బైకులలో ఇదీ ఒకటి.
(MS Dhoni on Instagram)ఇతర గ్యాలరీలు