టాప్ 5 స్టాక్స్.. ఫలితాల సీజన్‌కు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసులు-motilal oswal top 5 stocks in this earnings season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టాప్ 5 స్టాక్స్.. ఫలితాల సీజన్‌కు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసులు

టాప్ 5 స్టాక్స్.. ఫలితాల సీజన్‌కు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసులు

Apr 13, 2022, 06:00 PM IST HT Telugu Desk
Apr 13, 2022, 06:00 PM , IST

  • నిఫ్టీ 50 కంపెనీలలోని సగానికి పైగా కంపెనీలలో వృద్ధి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల కంపెనీల ద్వారా సాధ్యమవుతుందని దేశీయ బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ఇటీవలి ఎర్నింగ్స్ ప్రివ్యూ నివేదికలో పేర్కొంది. అసెట్ క్వాలిటీ ట్రెండ్స్‌లో మెరుగుదల వల్ల ఇది సాధ్యమవుతుందని ఈ బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. కంపెనీలు తమ ఆదాయ ఫలితాలను వెల్లడించే ఈ సీజన్‌లో మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ సిఫారసు చేస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల స్టాక్స్ ఇవే..

ICICI బ్యాంక్:  ఐసీఐసీఐ బ్యాంక్ దాని ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తిని గణనీయంగా 80 శాతానికి పెంచిందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇది పరిశ్రమలో అత్యధికం. గత కొన్ని క్వార్టర్లలో స్లిప్పేజెస్ తగ్గుముఖం పట్టాయి. ఇవి మరింత తగ్గుతాయని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ అంచనా వేసింది. బ్యాంక్ బాగా పరిపుష్టిగా ఉందని, దాని బ్యాలెన్స్ షీట్‌లో అధిక కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నుండి క్రెడిట్ ఖర్చుల సాధారణీకరణకు మార్గనిర్దేశం చేసిందని వివరించింది. కోర్ ఆపరేటింగ్ పనితీరుపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యకరమైన స్థిరమైన వృద్ధిని అందించే వీలుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.

(1 / 5)

ICICI బ్యాంక్:  ఐసీఐసీఐ బ్యాంక్ దాని ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తిని గణనీయంగా 80 శాతానికి పెంచిందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇది పరిశ్రమలో అత్యధికం. గత కొన్ని క్వార్టర్లలో స్లిప్పేజెస్ తగ్గుముఖం పట్టాయి. ఇవి మరింత తగ్గుతాయని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ అంచనా వేసింది. బ్యాంక్ బాగా పరిపుష్టిగా ఉందని, దాని బ్యాలెన్స్ షీట్‌లో అధిక కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నుండి క్రెడిట్ ఖర్చుల సాధారణీకరణకు మార్గనిర్దేశం చేసిందని వివరించింది. కోర్ ఆపరేటింగ్ పనితీరుపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యకరమైన స్థిరమైన వృద్ధిని అందించే వీలుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.

SBI: ఎస్బీఐ దాని బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేస్తోందని, దాని రాబడి నిష్పత్తులను మెరుగుపరుస్తోందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. హైక్వాలిటీ లోన్ పోర్ట్‌ఫోలియో నిర్మించడంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టిందని తెలిపింది. .

(2 / 5)

SBI: ఎస్బీఐ దాని బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేస్తోందని, దాని రాబడి నిష్పత్తులను మెరుగుపరుస్తోందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. హైక్వాలిటీ లోన్ పోర్ట్‌ఫోలియో నిర్మించడంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టిందని తెలిపింది. .(MINT_PRINT)

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: రిటైల్ లోన్లలో బలమైన సీక్వెన్షియల్ ట్రెండ్‌ కారణంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరుస్తోందని మోతీలాల్ బ్రోకరేజ్ తెలిపింది. ఇది బలమైన పురోగమనాన్ని అంచనా వేస్తోంది. FY22-24లో రుణాలు 17 శాతం సీఏజీఆర్ ఇవ్వగలవని అంచనా వేసింది, క్రెడిట్ వ్యయం తగ్గుముఖం పట్టడంతో అసెట్ క్వాలిటీ బలంగా ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.

(3 / 5)

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: రిటైల్ లోన్లలో బలమైన సీక్వెన్షియల్ ట్రెండ్‌ కారణంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరుస్తోందని మోతీలాల్ బ్రోకరేజ్ తెలిపింది. ఇది బలమైన పురోగమనాన్ని అంచనా వేస్తోంది. FY22-24లో రుణాలు 17 శాతం సీఏజీఆర్ ఇవ్వగలవని అంచనా వేసింది, క్రెడిట్ వ్యయం తగ్గుముఖం పట్టడంతో అసెట్ క్వాలిటీ బలంగా ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.(REUTERS)

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రిటైల్ డిపాజిట్లపై మెరుగైన దృష్టితో, బలమైన లయబులిటీ ఫ్రాంచైజీని నిర్మించే దిశగా బ్యాంకు తన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. కాసా నిష్పత్తి కూడా Q3FY22 నాటికి 39 శాతానికి మెరుగుపడింది. మిశ్రమ రిటైల్ డిపాజిట్ల పెరుగుదల.. మార్జిన్‌లకు దోహదపడుతుందని తెలిపింది. సురక్షిత పుస్తకం యొక్క అధిక మిశ్రమం, బలమైన ష్యూరిటీ,  సమర్ధవంతమైన వసూళ్లు స్థిరమైన ఆస్తి నాణ్యతను చూపనుందని తెలిపింది.

(4 / 5)

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రిటైల్ డిపాజిట్లపై మెరుగైన దృష్టితో, బలమైన లయబులిటీ ఫ్రాంచైజీని నిర్మించే దిశగా బ్యాంకు తన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. కాసా నిష్పత్తి కూడా Q3FY22 నాటికి 39 శాతానికి మెరుగుపడింది. మిశ్రమ రిటైల్ డిపాజిట్ల పెరుగుదల.. మార్జిన్‌లకు దోహదపడుతుందని తెలిపింది. సురక్షిత పుస్తకం యొక్క అధిక మిశ్రమం, బలమైన ష్యూరిటీ,  సమర్ధవంతమైన వసూళ్లు స్థిరమైన ఆస్తి నాణ్యతను చూపనుందని తెలిపింది.(Pixabay)

SBI లైఫ్: ఎస్బీఐ లైఫ్ ఇండివిడ్యువల్ వెయిటెడ్ రిసీవ్‌డ్ ప్రీమియం (డబ్ల్యూఆర్పీ)తో  అన్ని సెగ్మెంట్‌లలో బలమైన వృద్ధిని సాధించింది, యులిప్ వాటా కూడా పుంజుకుందని, మెరుగైన ట్రెండ్‌ కనబరుస్తోందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. 

(5 / 5)

SBI లైఫ్: ఎస్బీఐ లైఫ్ ఇండివిడ్యువల్ వెయిటెడ్ రిసీవ్‌డ్ ప్రీమియం (డబ్ల్యూఆర్పీ)తో  అన్ని సెగ్మెంట్‌లలో బలమైన వృద్ధిని సాధించింది, యులిప్ వాటా కూడా పుంజుకుందని, మెరుగైన ట్రెండ్‌ కనబరుస్తోందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. (unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు