తెలుగు న్యూస్ / ఫోటో /
Mohammed Shami Records: మహ్మద్ షమి 7 వికెట్లు.. 8 వరల్డ్ కప్ రికార్డులు
- Mohammed Shami Records: మహ్మద్ షమి సెమీ ఫైనల్లో తీసిన 7 వికెట్లతో 8 వరల్డ్ కప్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో షమి 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయడంతో ఇండియా 70 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే.
- Mohammed Shami Records: మహ్మద్ షమి సెమీ ఫైనల్లో తీసిన 7 వికెట్లతో 8 వరల్డ్ కప్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో షమి 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయడంతో ఇండియా 70 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే.
(1 / 8)
Mohammed Shami Records: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ సెమీఫైనల్లో 7 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడు పలు వరల్డ్ కప్ రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో మొదటిది.. వన్డే వరల్డ్ కప్ లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలవడం. మెక్‌గ్రాత్, మురళీధరన్, మిచెల్ స్టార్క్, మలింగా, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్.(PTI)
(2 / 8)
Mohammed Shami Records: వన్డే వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా మహ్మద్ షమి నిలిచాడు. అతడు కేవలం 17వ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంతకుముందు మిచెల్ స్టార్క్ (19 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది.(ANI)
(3 / 8)
Mohammed Shami Records: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన మహ్మద్ షమీదే. అతడు 48 ఏళ్ల కిందట 1975లో ఆస్ట్రేలియా బౌలర్ గ్యారీ గిల్మోర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. గిల్మోర్ సెమీఫైనల్లో 12 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా.. ఇప్పుడు షమి 7 వికెట్లు తీశాడు.(ANI)
(4 / 8)
Mohammed Shami Records: వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఇండియన్ బౌలర్ గా షమి నిలిచాడు. గతంలో స్టువర్ట్ బిన్నీ పేరిట ఈ రికార్డు ఉండేది. అతడు 2014 జూన్ లో బంగ్లాదేశ్ పై 4.4 ఓవర్లలో 4 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీయగా.. ఇప్పుడు షమి 7 వికెట్లు తీశాడు.(Hindustan Times)
(5 / 8)
Mohammed Shami Records: వరల్డ్ కప్ లలో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన ఘనతను కూడా షమి సొంతం చేసుకున్నాడు. షమి నాలుగోసారి ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఇప్పటి వరకూ స్టార్క్ (3 సార్లు) పేరిట ఈ రికార్డు ఉండేది.(PTI)
(6 / 8)
Mohammed Shami Records: ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా షమి సొంతమైంది. షమి ఈ వరల్డ్ కప్ లోనే ఒక ఇన్నింగ్స్ లో మూడుసార్లు ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. గతంలో ఐదుగురు బౌలర్లు రెండేసి సార్లు ఈ రికార్డు సాధించారు.(PTI)
(7 / 8)
Mohammed Shami Records: ఒక వన్డే వరల్డ్ కప్ ఎడిసన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్ గా మహ్మద్ షమి నిలిచాడు. 2011లో జహీర్ ఖాన్ 21 వికెట్లతో నెలకొల్పిన రికార్డును షమి తిరగరాశాడు.(Hindustan Times)
ఇతర గ్యాలరీలు