BJP And TDP: చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ, నామినేటెడ్ పదవుల భర్తీపైనే ప్రధాన చర్చ! బీజేపీ అభ్యంతరాలతో నిలిచిన నియామకాలు
- BJP And TDP: ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అంతకు ముందు విజయవాడలోని పురందేశ్శరి నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పార్టీ అధ్యక్షురాలితో పాటు అఖిల భారత సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు కేంద్రంగా ఈ భేటీ జరిగింది.

(2 / 8)
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో జరిగిన సమావేశానికి బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అఖిల భారత సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తాజా రాజకీయ పరిణామాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
(3 / 8)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమిలో నెలకొన్న అంశాలపై ఈ భేటీలో చర్చించారు.
(4 / 8)
ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకి ముందు పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతలు సమాలోచనలు జరిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపి సీఎం. రమేష్, రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్, బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు, విప్ ఆది నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే లు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, డాక్టర్ పార్థసారథి, ఎన్ ఈశ్వర రావు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ తదితరులు భేటీలో ఉన్నారు
(6 / 8)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. ఏపీలో త్వరలో జరుగనున్న నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో సీఎంతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
(7 / 8)
ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఇటీవల నామినేటెడ్ పదవుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి సమాన ప్రాతినిధ్యం కావాలనే డిమాండ్ ఆ పార్టీ నేతల్లో ఉంది.
ఇతర గ్యాలరీలు