Pawan Kalyan : ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా, అది నా బాధ్యతను గుర్తుచేస్తుంది - పవన్ కల్యాణ్-mangalagiri janasena chief pawan kalyan meets mlas mps told them be accountability ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan : ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా, అది నా బాధ్యతను గుర్తుచేస్తుంది - పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా, అది నా బాధ్యతను గుర్తుచేస్తుంది - పవన్ కల్యాణ్

Jun 05, 2024, 03:27 PM IST Bandaru Satyaprasad
Jun 05, 2024, 03:27 PM , IST

  • Pawan Kalyan : తాను ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎందుకంటే ఈ డబ్బు ప్రజల రక్తం, స్వేదం నుంచి వచ్చిందని గుర్తుచేశారు. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు బాధ్యత గుర్తురావాలన్నారు. బుధవారం నూతన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

తాను ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎందుకంటే ఈ డబ్బు ప్రజల రక్తం, స్వేదం నుంచి వచ్చిందని గుర్తుచేశారు. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు బాధ్యత గుర్తురావాలి, అందరం జవాబుదారీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దామన్నారు.  

(1 / 7)

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన విజయం సాధించింది. విజేతలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 

(2 / 7)

ప్రజల మనపై పెట్టిన బాధ్యతను నిర్వర్తించాలని పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యతా యుతంగా, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని, అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపునిచ్చారు. 

(3 / 7)

 తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు వస్తుందన్నారు పవన్ కల్యాణ్.  తనకు జీతం ముఖ్యం కాదని, అంతకు మించి సొమ్మును ప్రజలకు ఖర్చు చేస్తానన్నారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వీలువైన అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతను ప్రజలు అప్పగించారన్నారు. 

(4 / 7)

దేశాభివృద్ధిలో ఏపీ కీలకమైందని, చిన్న నిర్ణయం ఎన్డీఏకు ఊతమిచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన గోరంత దీపమని ఇప్పుడు కొండంత వెలుగునిచ్చిందన్నారు. 

(5 / 7)

తన కంటే జనసేన అభ్యర్థులకు ఎక్కువ మెజార్టీ రావడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు పవన్. ప్రజలు బలమైన మార్పును కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షలను గుండెలో పెట్టుకుని చూసుకోవాలని నూతన ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరారు.

(6 / 7)

పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను సత్కరిస్తున్న టీడీపీ నేత వర్మ

(7 / 7)

పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను సత్కరిస్తున్న టీడీపీ నేత వర్మ

WhatsApp channel

ఇతర గ్యాలరీలు