Lunar Eclipse 2024: చంద్రగ్రహణం ఏ సమయంలో ఉండనుంది ? ఈ మూడు రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి!
Lunar Eclipse 2024: చంద్ర గ్రహణం రేపు (సెప్టెంబర్ 18) ఉండనుంది. భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. అందుకే సూతక కాలం ఉండదు. ఈ గ్రహణ సమయం ఏంటి.. ఏ రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చూడండి.
(1 / 6)
భాద్రపద మాసం పౌర్ణమి అయిన రేపు (సెప్టెంబర్ 18) చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇది రెండో చంద్ర గ్రహణం. ఈ గ్రహణాన్ని శుభప్రదంగా పరిగణించరు.
(2 / 6)
భారత్‍లో రేపు (సెప్టెంబర్ 18) చంద్ర గ్రహణం ఉదయం 6 గంటల 11 నిమిషాలకు మొదలై ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయం కాబట్టి భారత్‍లో ఈ గ్రహణం కనిపించదు. అందుకే గ్రహణ సూతక కాలం ఉండదు.
(3 / 6)
అయితే, ఈ చంద్ర గ్రహణం మూడు రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అందుకే వారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవంటే..
(4 / 6)
కర్కాటకం: చంద్ర గ్రహణం కర్కాట రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో వారు కొత్త పనులను ప్రారంభించకూడదు. కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి.
(5 / 6)
సింహం: ఈ సంవత్సరంలో వస్తున్న ఈ రెండో చంద్ర గ్రహణం సింహ రాశి వారికి కూడా దుష్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో వీరు మాటలను అదుపు చేసుకుంటే మేలు. డ్రైవింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాహువు వల్ల మనసు గందోరగోళంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
(6 / 6)
కన్య: ఈ గ్రహణం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉండదు. ఈ కాలంలో వీరు ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. గ్రహణ కాలంలో ప్రయాణాలు చేయకుంటే మేలు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు