తెలుగు న్యూస్ / ఫోటో /
Anger | పట్టరాని కోపం ఉన్నా పంటి కింద దాచేస్తున్నారా? సైకాలజిస్టులు చెప్పేదిదే!
- నెగెటివ్ భావాలను, ప్రతికూల పరిస్థితులను నియంత్రించే మార్గాలలో కోపాన్ని అదుపుచేసుకోవడం కూడా ఒకటి. అయితే దీర్ఘకాలం పాటు కోపాన్ని అణిచివేయడం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు.
- నెగెటివ్ భావాలను, ప్రతికూల పరిస్థితులను నియంత్రించే మార్గాలలో కోపాన్ని అదుపుచేసుకోవడం కూడా ఒకటి. అయితే దీర్ఘకాలం పాటు కోపాన్ని అణిచివేయడం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు.
(1 / 9)
ఉబికి వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే ఏమి చేయలేని నిస్సహాయతకు అది సంకేతం. దీనివల జీవితంలో నిరాశ, నిప్సృహలు పెరుగుతాయి. జీవితంపై ఆశ సన్నగిలుతుంది. మానసిక ఒత్తిడి తీవ్రమైతే ఆత్మహత్యకు దారితీయవచ్చు. కోపానికి సంబంధించి సైకోథెరపిస్ట్ సారా కుబెరిక్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.(Pixabay)
(2 / 9)
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా మనిషి పదేపదే అదే విషయంపై ఆలోచనలు చేస్తూ ఉంటాడు. మన గతానుభావాల దృష్ట్యా కొన్నిసార్లు కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది.(Pixabay)
(3 / 9)
కోపాన్ని వ్యక్తపరిచి, ఆ తర్వాతి పరిణామాలతో విచారపడేకంటే కోపాన్ని అదిమిపట్టుకోవడమే మేలని భావిస్తారు.(Pixabay)
(4 / 9)
కొంతమంది వారి భావోద్వేగాలను నియంత్రిచుకోలేరు, వారిలో ఆ స్కిల్స్ ఉండవు. కాబట్టి ఏం చేయాలో తోచదు.(Pixabay)
(5 / 9)
కొంతమందికి కోపం వచ్చినా మనకెందుకులే రిస్క్ అని వదిలేసి, ఆ కోపాన్ని మాత్రం అలాగే ఉంచుకుంటారు.(Pixabay)
(6 / 9)
మనకెందుకులే అని కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించకపోవడం వల్ల కూడా నష్టం జరగవచ్చు. దక్కాల్సింది దక్కకపోవచ్చు, బంధాలు చెడిపోవచ్చు.(Pexels)
(7 / 9)
కొంతమంది కోపాన్ని అలాగే అదిమిపెట్టి ఉంచుకుంటారు. ఎందుకంటే అది ఎదుటివారిపై పగను సజీవంగా ఉంచుతుంది. వారిలో ఆవేశం, ఉక్రోశం ఎప్పుడూ ఉంటాయి.(Unsplash)
(8 / 9)
మళ్లీ మళ్లీ గాయపడకుండా రక్షణాత్మక ధోరణి ప్రదర్శించేందుకు కొంతమందికి పీకలదాకా కోపం ఉన్నా ఏమి చేయలేక, వారి కోపాన్ని అదుపుచేసుకొని ఉంటారు.(Pexels)
ఇతర గ్యాలరీలు