తెలుగు న్యూస్ / ఫోటో /
Pregnancy diet chart for winter: ప్రెగ్నెన్సీలో వింటర్ డైట్ ఇలా ఉంటే మంచిది
- Pregnancy diet chart for winter: ప్రెగ్నెన్సీలో డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వింటర్‌లో గర్భిణులు సీజన్‌కు తగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ వింటర్ డైట్ ఛార్ట్ ఒకసారి పరిశీలించండి.
- Pregnancy diet chart for winter: ప్రెగ్నెన్సీలో డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వింటర్‌లో గర్భిణులు సీజన్‌కు తగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ వింటర్ డైట్ ఛార్ట్ ఒకసారి పరిశీలించండి.
(1 / 6)
ప్రతి స్త్రీ జీవితంలో మాతృత్వం ఒక ముఖ్యమైన ఘట్టం. గర్భధారణ సమయంలో స్త్రీలు శారీరకంగా, మానసికంగా అనేక మార్పులకు గురవుతారు. కాబట్టి ఈ కొద్ది నెలల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారంపై తగిన శ్రద్ధ పెట్టాలి.(Freepik)
(2 / 6)
గుడ్లు: గుడ్లు ప్రోటీన్‌కు గొప్ప సోర్స్. ఇది కోలిన్, లుటిన్, డీ విటమిన్, బీ12 విటమిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్ వంటి పోషకాలను శరీరానికి అందిస్తుంది. గుడ్లు ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. శిశువు ఎముకలు, కండరాల అభివృద్ధిలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది.(Freepik)
(3 / 6)
నట్స్: చలికాలంలో బాదాం, వాల్ నట్స్, జీడిపప్పు, ఖర్జూరాలు తినడం గర్భిణులకు మంచిది. ఈ గింజల్లో ఫైబర్, విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఈ ఆహారం ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. కానీ స్వీట్ డ్రై ఫ్రూట్స్ మాత్రం తినకూడదు. అవి ప్రాసెస్ చేసిన చక్కెరలు, ఉప్పును కలిగి ఉంటాయి.(Freepik)
(4 / 6)
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: చలికాలంలో కూరగాయలు మార్కెట్‌లో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పాలకూర, మెంతి గర్భధారణ సమయంలో శరీరానికి మేలు చేస్తాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. అలాగే ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ మెదడుకు, వెన్నుపూసకు బలం చేకూరుస్తుంది.(Freepik)
(5 / 6)
పప్పులు: బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఐరన్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో పప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. శరీరం ఎక్కువ రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.(Freepik)
(6 / 6)
చేపలు: సాల్మన్, ట్యూనా, సార్డినెస్, మాకేరెల్ వంటి సముద్రపు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అదనంగా, ఇది రోగనిరోధక కణాలను కూడా పెంచుతుంది. ఈ రకమైన చేపలలో జింక్, సెలీనియం, విటమిన్ డి కూడా ఉంటాయి. గర్భధారణ సమయంలో చేపలు తినడం వల్ల బిడ్డ మెదడు అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు