Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన భారత్.. పొటోలపై ఓ లుక్కేయండి-kl rahul led indian team was travelling to zimbabwe for 3 odis against india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన భారత్.. పొటోలపై ఓ లుక్కేయండి

Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన భారత్.. పొటోలపై ఓ లుక్కేయండి

Aug 13, 2022, 09:15 PM IST Maragani Govardhan
Aug 13, 2022, 09:15 PM , IST

  • Ind Vs Zim Photos: వెస్టిండీస్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు బయల్దేరింది. ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో ఇండియా మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌కు పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు.

జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆ దేశానికి టీమిండియా బయల్దేరింది. ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు 18 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. భారత జట్టు శుక్రవారమే అక్కడకు పయనమైంది.

(1 / 8)

ఆటగాళ్ల ట్రావెలింగ్ ఫొటోలను బిసీసీఐ షేర్ చేసింది. ఈ ఫొటోలో వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్, ఇతర స్టార్ ఆటగాళ్లు దీపక్ చాహర్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు.

(2 / 8)

జింబాబ్వే పర్యటనకు జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బ్రేక్ ఇచ్చారు. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ భారజ జట్టుతో కలిసి జింబాబ్వేకు బయల్దేరి వెళ్లారు.

(3 / 8)

జింబాబ్వేతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ ఆగస్టు 18 కాగా, రెండో వన్డే ఆగస్టు 20, చివరిది ఆగస్టు 22న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

(4 / 8)

శిఖర్ ధావన్ ఓ ప్రత్యేక ఫొటోను పంచుకున్నాడు. అతడు సోఫాలో నిద్రిస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశాడు.

(5 / 8)

ఈ పర్యటనలో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. దీంతో చాలా మంది యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది. ఈ సారి మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, శార్దూల్ ఠాకూర్ కూడా కనిపించారు.

(6 / 8)

ఈ సిరీస్‌లో టీమిండియాకు కేఎల్ రాహుల్ నేతృత్వం వహిస్తున్నాడు. తొలుత ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా.. రాహుల్ రాకతో ధావన్ ను వైస్ కెప్టెన్‌తో సరిపెట్టారు.

(7 / 8)

శార్దూల్ ఠాకూర్-శిఖర్ ధావన్

(8 / 8)

శార్దూల్ ఠాకూర్-శిఖర్ ధావన్(all photo- BCCI Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు