తెలుగు న్యూస్ / ఫోటో /
Joe Root: టీమిండియాపై ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.. జో రూట్ టాప్
- Joe Root: ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టీమిండియాపై గతంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఇండియాపైనే అతడు 10వ సెంచరీ చేయడం విశేషం.
- Joe Root: ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టీమిండియాపై గతంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఇండియాపైనే అతడు 10వ సెంచరీ చేయడం విశేషం.
(1 / 6)
Joe Root: టీమిండియాతో రాంచీలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రారంభమైన నాలుగో టెస్టులో జో రూట్ సెంచరీ చేశాడు. తొలి రోజు 226 బంతుల్లో 106 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ ను ఆదుకున్నాడు. టెస్టుల్లో ఇండియాపై అతనికిది 10వ సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా అతడు నిలిచాడు.
(2 / 6)
Joe Root: బజ్‌బాల్ అంటూ ఈ సిరీస్ లో తొలి మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యాడతడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ మ్యాచ్ లో తనదైన స్టైల్లో నింపాదిగా ఆడుతూ.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఇండియాపై ఇప్పటి వరకూ 9 టెస్టు సెంచరీలతో టాప్ లో ఉన్న స్టీవ్ స్మిత్ ను వెనక్కి 10వ సెంచరీ చేశాడు.
(3 / 6)
Joe Root: జో రూట్ 226 బంతుల్లో 106 రన్స్ చేసి అజేయంగా ఉన్నాడు. అతని ఇన్నింగ్స్ లో కేవలం 9 ఫోర్లే ఉన్నాయంటే ఎంత జాగ్రత్తగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. రివర్స్ స్కూప్ లాంటి షాట్ల జోలికి వెళ్లలేదు. ఇండియాపై 52వ ఇన్నింగ్స్ లో అతడు 10వ సెంచరీ చేశాడు. స్మిత్ 37 ఇన్నింగ్స్ లో 9 సెంచరీలు, గ్యారీ సోబర్స్ 30 ఇన్నింగ్స్ లో 8, రికీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్ లో 8, వివ్ రిచర్డ్స్ 41 ఇన్నింగ్స్ లో 8 సెంచరీలు చేశారు.
(4 / 6)
Joe Root: ఇక ఈ ఇన్నింగ్స్ తో జో రూట్ అంతర్జాతీయ క్రికెట్ లో 19 వేల రన్స్ చేశాడు. 444వ ఇన్నింగ్స్ లో రూట్ ఈ ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 19 వేల రన్స్ చేసిన వారిలో రూట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 399 ఇన్నింగ్స్ లో టాప్ లో ఉన్నాడు. సచిన్ (432), లారా (433) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
(5 / 6)
Joe Root: టెస్టు క్రికెట్ లో రూట్ 11500 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో 7 పరుగులు పూర్తి చేయగానే రూట్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఇతర గ్యాలరీలు