IPL 2024: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో చెన్నైతో త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదంటే?-ipl 2024 schedule and venues csk faces rcb on inauguration match ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ipl 2024 Schedule And Venues Csk Faces Rcb On Inauguration Match

IPL 2024: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో చెన్నైతో త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదంటే?

Feb 22, 2024, 12:34 PM IST Nelki Naresh Kumar
Feb 22, 2024, 12:34 PM , IST

Indian Premier League 2024: క్రికెట్ ఫ్యాన్స్ మ‌జా అందించేందుకు ఐపీఎల్ 2024 రెడీ అవుతోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ మొద‌లుకాబోతుంది. రెండు నెల‌ల‌కుపైగా ఐపీఎల్ క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌బోతున్న‌ది. ఈ 17వ సీజ‌న్‌లో 10 టీమ్‌లు క‌లిసి 74 మ్యాచ్‌లు ఆడ‌బోతున్నాయి.

ఐపీఎల్ 2024లో ఫ‌స్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. 

(1 / 8)

ఐపీఎల్ 2024లో ఫ‌స్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. (PTI)

ఐపీఎల్ 2024 లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోనీ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. అత‌డికి ఇదే చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీజ‌న్‌తో ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెప్ప‌నున్నాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. 

(2 / 8)

ఐపీఎల్ 2024 లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోనీ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. అత‌డికి ఇదే చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీజ‌న్‌తో ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెప్ప‌నున్నాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. (PTI)

ఫిబ్ర‌వ‌రి 22న (నేడు) ఐపీఎల్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. టైటిల్ కోసం మొత్తం 10 టీమ్ త‌ల‌ప‌డ‌బోతున్నాయి. 

(3 / 8)

ఫిబ్ర‌వ‌రి 22న (నేడు) ఐపీఎల్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. టైటిల్ కోసం మొత్తం 10 టీమ్ త‌ల‌ప‌డ‌బోతున్నాయి. (PTI)

ప‌దిహేను రోజుల షెడ్యూల్‌ను మాత్ర‌మే ఫిబ్ర‌వ‌రి 22న ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్‌మెంట్‌ లైవ్ టెలికాస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

(4 / 8)

ప‌దిహేను రోజుల షెడ్యూల్‌ను మాత్ర‌మే ఫిబ్ర‌వ‌రి 22న ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్‌మెంట్‌ లైవ్ టెలికాస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. (AFP)

ఐపీఎల్  టైమ్‌లోనే లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఎలెక్ష‌న్స్ డేట్స్ ప్ర‌క‌టించిన త‌ర్వాతే మిగిలిన ఐపీఎల్ షెడ్యూల్‌ను అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(5 / 8)

ఐపీఎల్  టైమ్‌లోనే లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఎలెక్ష‌న్స్ డేట్స్ ప్ర‌క‌టించిన త‌ర్వాతే మిగిలిన ఐపీఎల్ షెడ్యూల్‌ను అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. (PTI)

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఇండియాలోనే జ‌రుగున్నాయి. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఐపీఎల్ విదేశాల్లో జ‌రుగ‌నున్న‌ట్లు వినిపిస్తోన్న వార్త‌ల‌ను బీసీసీఐ కొట్టిప‌డేసింది. 

(6 / 8)

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఇండియాలోనే జ‌రుగున్నాయి. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఐపీఎల్ విదేశాల్లో జ‌రుగ‌నున్న‌ట్లు వినిపిస్తోన్న వార్త‌ల‌ను బీసీసీఐ కొట్టిప‌డేసింది. (PTI)

మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 26న ఫైన‌ల్ నిర్వ‌హించ‌బోతున్నారు. మొత్తం 67 రోజుల పాటు ఐపీఎల్ సీజ‌న్ 17  క్రికెట్ అభిమానుల‌ను క‌నువిందు చేయ‌బోతున్న‌ది. గ‌త ఏడాది కేవ‌లం అర‌వై రోజులు మాత్ర‌మే ఐపీఎల్‌ను నిర్వ‌హించారు. ఈ సారి ఎన్నిక‌ల కార‌ణంగా వారం రోజుల పొడిగించారు. 

(7 / 8)

మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 26న ఫైన‌ల్ నిర్వ‌హించ‌బోతున్నారు. మొత్తం 67 రోజుల పాటు ఐపీఎల్ సీజ‌న్ 17  క్రికెట్ అభిమానుల‌ను క‌నువిందు చేయ‌బోతున్న‌ది. గ‌త ఏడాది కేవ‌లం అర‌వై రోజులు మాత్ర‌మే ఐపీఎల్‌ను నిర్వ‌హించారు. ఈ సారి ఎన్నిక‌ల కార‌ణంగా వారం రోజుల పొడిగించారు. (PTI)

2019లో లోక్‌స‌భ ఎన్నిక‌ల కార‌ణంగా ఐపీఎల్‌ను రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించారు. 2024లో అదే ప‌ద్ద‌తిని కొన‌సాగించాల‌ని ఐపీఎల్ బోర్డ్ నిర్ణ‌యించింది. 

(8 / 8)

2019లో లోక్‌స‌భ ఎన్నిక‌ల కార‌ణంగా ఐపీఎల్‌ను రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించారు. 2024లో అదే ప‌ద్ద‌తిని కొన‌సాగించాల‌ని ఐపీఎల్ బోర్డ్ నిర్ణ‌యించింది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు