తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Purple Cap: ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్.. పర్పుల్ క్యాప్ గెలుస్తాడా.. ఈ నలుగురి నుంచీ పోటీ
- IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024కు టైమ్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) అత్యధిక వికెట్ల వీరుడిగా పర్పుల్ క్యాప్ అందుకుంటాడా? అతనికి ప్రధానంగా నలుగురి నుంచి పోటీ ఉంది.
- IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024కు టైమ్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) అత్యధిక వికెట్ల వీరుడిగా పర్పుల్ క్యాప్ అందుకుంటాడా? అతనికి ప్రధానంగా నలుగురి నుంచి పోటీ ఉంది.
(1 / 6)
IPL 2024 Purple Cap: ఐపీఎల్లో ప్రతి ఏటా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందిస్తారన్న విషయం తెలుసు కదా. ఈ ఏడాది ఆ క్యాప్ అందుకోగలిగిన వారిలో ప్రధానంగా ఐదుగురు ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం. వీళ్లలో అత్యధిక పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)తోపాటు యుజువేంద్ర చహల్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, బుమ్రాలాంటి వాళ్లు ఉన్నారు.
(2 / 6)
IPL 2024 Purple Cap: పర్పుల్ క్యాప్ పై కన్నేసిన బౌలర్లలో యుజువేంద్ర చహల్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ అయిన చహల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ అతడు 142 మ్యాచ్ లలో 183 వికెట్లు తీశాడు. గతంలో 2021లోనూ పర్పుల్ క్యాప్ గెలిచిన అతడు.. ఈసారి కూడా రేసులో ఉన్నాడు.
(3 / 6)
IPL 2024 Purple Cap: గాయంతో చాలా రోజులుగా ఆఫ్ఘనిస్థాన్ కు దూరంగా ఉన్న లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ఈసారి గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆడనున్నాడు. గతేడాది 17 మ్యాచ్ లలో ఆ టీమ్ తరఫున 27 వికెట్లు తీశాడు. 109 ఐపీఎల్ మ్యాచ్ లలో 139 వికెట్లు తీసిన రషీద్ ఖాన్.. ఈసారి కూడా పర్పుల్ క్యాప్ కు పోటీలో ఉన్నాడు.
(4 / 6)
IPL 2024 Purple Cap: ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా లీగ్ కు తిరిగొస్తున్నాడు. భారీ ఆశలతో అతన్ని వేలంలో కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ.. స్టార్క్ రాణిస్తాడన్న నమ్మకంతో ఉంది. అతడు కూడా ఈ ఏడాది పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు.
(5 / 6)
IPL 2024 Purple Cap: ఐపీఎల్లో తొలిసారి వేలంలో రూ.20 కోట్ల మార్క్ దాటిన ప్లేయర్ గా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (రూ.20.5 కోట్లు) ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాను డబ్ల్యూటీసీ, వరల్డ్ కప్ గెలిపించిన కమిన్స్ ఈసారి సన్ రైజర్స్ ను ట్రోఫీ గెలిపించి పర్పుల్ క్యాప్ గెలుస్తాడేమో చూడాలి.
ఇతర గ్యాలరీలు