(1 / 5)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఆదివారం (ఏప్రిల్ 28) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పైకి రాగా.. సర్ రైజర్స్ దిగజారింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఏకంగా 78 పరుగులతో సన్ రైజర్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.
(PTI)(2 / 5)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఒకేసారి ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్ కు ముందు వరకు 8 మ్యాచ్ లలో 8 పాయింట్లతో ఆరోస్థానంలో చెన్నై ఉండేది. కానీ ఈ మ్యాచ్ లో భారీ విజయం తర్వాత 10 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.
(PTI)(3 / 5)
IPL 2024 Points Table: ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు ఓటములతో నాలుగో స్థానానికి దిగజారింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కో స్థానం దిగజారాయి. సన్ రైజర్స్ ప్రస్తుతం 9 మ్యాచ్ లలో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
(SRH Twitter)(4 / 5)
IPL 2024 Points Table: ఆదివారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటన్స్ పై 9 వికెట్లతో గెలిచిన ఆర్సీబీ పదో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆ టీమ్ 10 మ్యాచ్ లలో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి పదో స్థానంలో ఉంది.
(PTI)(5 / 5)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో 46 మ్యాచ్ లు ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ లో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆఱు, గుజరాత్ టైటన్స్ ఏడు, పంజాబ్ కింగ్స్ 8, ముంబై ఇండియన్స్ 9, ఆర్సీబీ పదో స్థానాల్లో ఉన్నాయి.
(ANI)ఇతర గ్యాలరీలు