IPL 2024 Points Table: లక్నో దెబ్బకి టాప్ 4 నుంచి సన్ రైజర్స్ ఔట్.. ముంబై ఇండియన్స్ ఇక ఇంటికే..-ipl 2024 points table lucknow super giants moved to third after win over mumbai indians sunrisers out of top 4 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Points Table: లక్నో దెబ్బకి టాప్ 4 నుంచి సన్ రైజర్స్ ఔట్.. ముంబై ఇండియన్స్ ఇక ఇంటికే..

IPL 2024 Points Table: లక్నో దెబ్బకి టాప్ 4 నుంచి సన్ రైజర్స్ ఔట్.. ముంబై ఇండియన్స్ ఇక ఇంటికే..

May 01, 2024, 08:01 AM IST Hari Prasad S
May 01, 2024, 08:01 AM , IST

  • IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ టాప్ 4 నుంచి బయటకు వెళ్లిపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా దిగజారింది. ముంబై ఇండియన్స్ ఇక ప్లేఆఫ్స్ చేరడం కూడా కష్టమే.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ వైఫల్యంతో కేవలం 144 రన్స్ చేయగా.. తర్వాత కాస్త కష్టంగానే అయినా ఆ టార్గెట్ ను చేజ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 4 వికెట్లతో విజయం సాధించింది.

(1 / 5)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ వైఫల్యంతో కేవలం 144 రన్స్ చేయగా.. తర్వాత కాస్త కష్టంగానే అయినా ఆ టార్గెట్ ను చేజ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 4 వికెట్లతో విజయం సాధించింది.(ANI )

IPL 2024 Points Table: ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. ఆ టీమ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 12 పాయింట్లతోనే ఉన్నా ఆ టీమ్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

(2 / 5)

IPL 2024 Points Table: ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. ఆ టీమ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 12 పాయింట్లతోనే ఉన్నా ఆ టీమ్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.(AFP)

IPL 2024 Points Table: ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లే. ఆ టీమ్ ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో 9వ స్థానంలోనే కొనసాగుతోంది. 10 మ్యాచ్ లలో కేవలం మూడు గెలిచి, ఏడు ఓడి 6 పాయింట్లతో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం అనుమానమే.

(3 / 5)

IPL 2024 Points Table: ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లే. ఆ టీమ్ ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో 9వ స్థానంలోనే కొనసాగుతోంది. 10 మ్యాచ్ లలో కేవలం మూడు గెలిచి, ఏడు ఓడి 6 పాయింట్లతో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం అనుమానమే.(AFP)

IPL 2024 Points Table: ముంబై ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల టేబుల్లో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో ఐదు గెలిచి పది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4 నుంచి వెళ్లిపోయింది. ఆ టీమ్ కూడా 9 మ్యాచ్ లలో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు, గుజరాత్ టైన్స్ ఏడో స్థానంలో ఉన్నాయి.

(4 / 5)

IPL 2024 Points Table: ముంబై ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల టేబుల్లో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో ఐదు గెలిచి పది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4 నుంచి వెళ్లిపోయింది. ఆ టీమ్ కూడా 9 మ్యాచ్ లలో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు, గుజరాత్ టైన్స్ ఏడో స్థానంలో ఉన్నాయి.(AFP)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో 16 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్ లలో 12 పాయింట్లతో రెండో స్థానంలో, లక్నో మూడు, చెన్నై నాలుగు, సన్ రైజర్స్ ఐదు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు, గుజరాత్ టైటన్స్ ఏడు, పంజాబ్ కింగ్స్ ఎనిమిది, ముంబై ఇండియన్స్ 9, ఆర్సీబీ పదో స్థానాల్లో ఉన్నాయి.

(5 / 5)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో 16 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్ లలో 12 పాయింట్లతో రెండో స్థానంలో, లక్నో మూడు, చెన్నై నాలుగు, సన్ రైజర్స్ ఐదు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు, గుజరాత్ టైటన్స్ ఏడు, పంజాబ్ కింగ్స్ ఎనిమిది, ముంబై ఇండియన్స్ 9, ఆర్సీబీ పదో స్థానాల్లో ఉన్నాయి.(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు