iPhone 16 series: సెప్టెంబర్ లో ఐఫోన్ 16 సిరీస్ తో పాటు ఇవి కూడా లాంచ్ అవుతున్నాయి..
సెప్టెంబర్ లో జరగనున్న ఆపిల్ ఈవెంట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆపిల్ సంస్థ ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ ఈవెంట్ లో లేటెస్ట్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు పలు ఇతర డివైజెస్ ను లాంచ్ చేస్తారు.
(1 / 4)
ఐఫోన్ 16 మోడళ్లను సెప్టెంబర్ 10న జరగబోయే ఆపిల్ ఈవెంట్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఆపిల్ కొత్త నిలువుగా అమర్చిన కెమెరాలు, యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్ తో కొన్ని డిజైన్ మార్పులను కలిగి ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు కొత్త తరం ఏ18 సిరీస్ చిప్సెట్తో వచ్చే అవకాశం ఉంది.(X.com/Apple Hub)
(2 / 4)
ఐఫోన్ 16 ప్రో మోడళ్లను కూడా లాంచ్ ఈవెంట్లో ప్రకటించనున్నారు. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ల పెద్ద స్క్రీన్ సైజులతో పాటు కొత్త క్యాప్చర్ బటన్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మెరుగైన ఎన్పీయూ పనితీరు, ఏఐ ప్రాసెసింగ్ సామర్థ్యాలతో ఏ18 ప్రో చిప్సెట్ ను ఈ స్మార్ట్ఫోన్ కలిగి ఉంటుంది. అదనంగా, కెమెరాలు గణనీయమైన అప్ గ్రేడ్లను కూడా పొందవచ్చు.(unsplash)
(3 / 4)
Apple Watch సిరీస్ 10: ఈ ఏడాది ఆపిల్ 10వ తరం స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేయనున్నారు. ఈ సిరీస్ 10 ఆపిల్ వాచ్ ఇంకా స్లిమ్ గా ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే వాచ్ లో రక్తపోటు, స్లీప్ అప్నియా ట్రాకింగ్ కోసం కొత్త సెన్సార్ ఉండవచ్చని తెలుస్తోంది.(Apple)
ఇతర గ్యాలరీలు