తెలుగు న్యూస్ / ఫోటో /
TIME's influential people: ‘టైమ్స్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆలియా భట్, సుందర్ పిచాయ్
- Alia Bhatt in TIME's list: 2024 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు ఉన్నారు.
- Alia Bhatt in TIME's list: 2024 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు ఉన్నారు.
(1 / 9)
2024 సంవత్సరానికి గానూ టైమ్స్ వెలువరించిన అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈ సంవత్సరం కూడా వివిధ రంగాలకు చెందిన పలువురు భారతీయులు స్థానం సంపాదించారు.
(2 / 9)
అలియా భట్: తన అసాధారణ నటనా నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి ఆలియా భట్.(PTI)
(3 / 9)
దేవ్ పటేల్: స్లమ్ డాగ్ మిలియనీర్, లయన్, ది గ్రీన్ నైట్ వంటి చిత్రాల్లో తన పవర్ ఫుల్ నటనతో హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్. (REUTERS)
(5 / 9)
సుందర్ పిచాయ్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈఓ గా సుందర్ పిచాయ్ వ్యవహరిస్తున్నారు. టెక్ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి, సాంకేతిక ప్రపంచంపై ఆయన చూపిన ప్రభావానికి ఈ గుర్తింపు లభించింది. (Bloomberg)
(6 / 9)
సాక్షి మాలిక్: క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారత రెజ్లర్ సాక్షి మాలిక్. ఆమె సాధించిన విజయాలు, క్రీడా ప్రపంచంపై ఆమె చూపిన ప్రభావానికి ఈ గుర్తింపు లభించింది. (ANI)
(7 / 9)
సత్య నాదెళ్ల: ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కు సీఈఓ సత్య నాదెళ్ల వ్యవహరిస్తున్నారు. టెక్ రంగంలో ఆయన నాయకత్వానికి, సృజనాత్మకతకు ఈ గుర్తింపు లభించింది. (AP)
(8 / 9)
ఇంద్రా నూయి: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి. వ్యాపార ప్రపంచంలో ఆమె సాధించిన విజయాలకు గానూ ఆమె ఈ గుర్తింపు పొందారు. (AFP)
ఇతర గ్యాలరీలు