(1 / 5)
Indian Hockey Team: ఇండియన్ హాకీ టీమ్ 41 ఏళ్ల తర్వాత గత టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచి ఆ చరిత్రను తిరిగరాసింది. 52 ఏళ్ల తర్వాత రెండు వరుస ఒలింపిక్స్ లో ఇండియా మెడల్స్ గెలిచింది.
(2 / 5)
Indian Hockey Team: ఇండియా 1968లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఆ తర్వాత 1972లో మరోసారి బ్రాంజ్ సొంతం చేసుకుంది. 1976లో మిస్సయినా.. 1980లో మరోసారి మెడల్ గెలిచింది. ఆ తర్వాత గత టోక్యో ఒలింపిక్స్ వరకు మరో మెడల్ గెలవలేదు. ఇప్పుడు రెండు వరుస ఒలింపిక్స్ లో మెడల్స్ ద్వారా రికార్డు క్రియేట్ చేసింది.
(3 / 5)
Indian Hockey Team: ఒలింపిక్స్ లో ఇండియా హాకీ టీమ్ రికార్డు ఇలా ఉంది. 1928లో తొలిసారి గోల్డ్ గెలిచిన మన టీమ్.. తర్వాత 1932, 1936, 1948, 1952, 1956లలో వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచింది.
(4 / 5)
Indian Hockey Team: ఇక 1960 ఒలింపిక్స్ లో తొలిసారి గోల్డ్ కాకుండా సిల్వర్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 1964లో మళ్లీ గోల్డ్ గెలవగా.. 1968, 1972లలో వరుసగా రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. 1980లో చివరిసారి హాకీలో ఇండియా గోల్డ్ మెడల్ గెలిచింది. 41 ఏళ్ల తర్వాత 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మళ్లీ బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో అదే రిపీట్ చేసింది.
ఇతర గ్యాలరీలు