తెలుగు న్యూస్ / ఫోటో /
India vs Pakistan: కోహ్లి కాదు.. రోహిత్ అంటేనే పాకిస్థాన్‌కు భయం.. ఇదే నిదర్శనం
- India vs Pakistan: కోహ్లి కాదు.. రోహిత్ అంటేనే పాకిస్థాన్‌కు భయం. ఈ మధ్యకాలంలో దాయాదిపై రోహిత్ చెలరేగుతున్న తీరు వాళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు వన్డే ఫార్మాట్ లోనే రోహిత్ తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాడు.
- India vs Pakistan: కోహ్లి కాదు.. రోహిత్ అంటేనే పాకిస్థాన్‌కు భయం. ఈ మధ్యకాలంలో దాయాదిపై రోహిత్ చెలరేగుతున్న తీరు వాళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు వన్డే ఫార్మాట్ లోనే రోహిత్ తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాడు.
(1 / 6)
India vs Pakistan: పాకిస్థాన్‌తో జరిగిన చివరి 5 వన్డేల్లో రోహిత్ శర్మనే టాప్ బ్యాటర్ గా నిలిచాడు. కోహ్లిని మించి రోహిత్ పరుగులు సాధించాడు. రోహిత్ 5 మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ లో సున్నా పరుగులకే ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించాడు. మిగిలిన 2 మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ దాటాడు. అందులో ఒకదాంట్లో 90లు కూడా దాటడం విశేషం. పాకిస్థాన్ తో చివరి ఐదు వన్డేల్లో రోహిత్ ఏకంగా 394 రన్స్ చేయడం విశేషం.
(2 / 6)
India vs Pakistan: 2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్, పాకిస్థాన్‌లు వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. జూన్ 16న మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 89 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. రోహిత్ శర్మ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 140 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సహజంగానే రోహిత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా రాణించాడు. 65 బంతుల్లో 7 బౌండరీలతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు.
(3 / 6)
India vs Pakistan: ఇక అంతకుముందు సెప్టెంబర్ 23, 2018న జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే 114 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడలేదు.
(4 / 6)
India vs Pakistan: ఇక అదే ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ లో సెప్టెంబర్ 19, 2018న జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దుబాయ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడలేదు. భువనేశ్వర్ కుమార్ 15 పరుగులిచ్చి 3 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
(5 / 6)
India vs Pakistan: అంతకుముందు ఏడాది అంటే..18 జూన్, 2017న ఓవల్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ 180 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 బంతులు ఆడినప్పటికీ ఖాతా తెరవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 5 పరుగుల వద్ద ఔటయ్యాడు.
(6 / 6)
India vs Pakistan: అదే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో 124 పరుగుల తేడాతో భారత్.. పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీకి 9 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అతడు 119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 68 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇతర గ్యాలరీలు