(1 / 11)
2024, ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా వందనం అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం రోజున వరుసగా 11 ప్రసంగాలు చేసిన మూడో ప్రధానిగా మోదీ నిలిచారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం తెల్లటి కుర్తా సెట్, బ్లూ బంద్ గలా జాకెట్ ను మోదీ ధరించారు. మల్టీ కలర్ రాజస్థానీ లెహేరియా ప్రింట్ తలపాగా చుట్టుకున్నారు.
(Youtube)(2 / 11)
2014 లో తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కోసం ప్రధాని మోదీ సాంప్రదాయ నారింజ, పసుపు, ఆకుపచ్చ రాజస్థానీ తలపాగాను ఎంచుకున్నారు. క్రీమ్ కలర్ కుర్తా, పైజామా సెట్ ధరించారు.
(File Photo)(3 / 11)
2015లో ఎర్రకోటపై నుంచి డార్క్ క్రీమ్ కలర్ కుర్తా, దానికి సరిపోయే ఖాదీ బంద్ గలా జాకెట్, వైట్ చుడీదార్ ధరించి మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దానికి ఆయన పసుపు రంగు డిజైన్ తలపాగా ధరించారు.
(Ajay Aggarwal/ HT Photo)(4 / 11)
2016 లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ తెల్లని కుర్తా, చుడీదార్ ప్యాంట్ ధరించారు. అతను ప్రకాశవంతమైన గులాబీ మరియు పసుపు రంగు టై-డై నమూనా తలపాగాను కూడా ధరించారు.
(File Photo/PTI)(5 / 11)
2017 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఎరుపు, పసుపు, కాషాల రంగుల సమ్మేళనంతో ఉన్న తలపాగాను ధరించారు. క్రీమ్ కలర్ హాఫ్ హ్యాండ్స్ కుర్తా-పైజామా సెట్ ధరించారు.
(Arun Sharma/Hindustan Times)(6 / 11)
2018లో ఆగస్ట్ 15ర ప్రధాని మోదీ కాషాయ తలపాగా ధరించారు. తెల్లటి కుర్తా సెట్ పై, నలుపు రంగు బార్డర్ ఉన్న కండువాతో సింపుల్ గా కనిపించారు.
(File Photo/PTI)(7 / 11)
2019 లో 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి తెల్లని కుర్తా సెట్ ను ప్రధాని మోదీ ధరించారు. అలాగే, చక్కని బహుళ రంగులతో కూడిన తలపాగా చుట్టుకున్నారు.
(Vipin Kumar/HT PHOTO)(8 / 11)
2020లో ప్రధాని మోదీ క్రీమ్ కలర్ కుర్తా, ప్యాంట్ సెట్ ధరించారు. భుజాలపై ఆరెంజ్, వైట్ కలర్ కండువా కప్పుకున్నారు. కాషాయం, క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉన్న తలపాగా ధరించారు.
(File Photo/PTI)(9 / 11)
2021లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కాషాయ తలపాగా ధరించే సంప్రదాయాన్ని మోదీ కొనసాగించారు. తెల్లటి కుర్తాపై నీలం రంగు జాకెట్ ధరించారు.పైన సింపుల్ బార్డర్ ఉన్న తెలుపు రంగు కండువా వేసుకున్నారు. పెరిగిన గడ్డంతో డిఫరెంట్ గా కనిపించారు.
(File Photo)(10 / 11)
2022లో ఎర్రకోటపై జెండావందనం సందర్భంగా జాతీయ జెండాలోని రంగులతో అలంకరించిన తలపాగాను ప్రధాని మోదీ ధరించారు. అలాగే, సంప్రదాయ వైట్ కుర్తా, ప్యాంట్ సెట్ ధరించారు. కుర్తాపై పౌడర్ బ్లూ కలర్ జాకెట్ ధరించారు.
(File Photo/Reuters)(11 / 11)
2023 పంద్రాగస్టున ప్రధాని మోదీ బహుళ రంగుల డిజైన్ లో ఉన్న రాజస్థానీ శైలి తలపాగాను ఎంచుకున్నారు. ఆఫ్ వైట్ కుర్తా, వైట్ ప్యాంట్, పాకెట్ స్క్వేర్ తో కూడిన జాకెట్ తో ఈ లుక్ ను పూర్తి చేశారు.
(File Photo/ANI)ఇతర గ్యాలరీలు