(1 / 6)
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‍ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ బౌల్డ్ అయ్యాడు. ఈ అద్భుతమైన యార్కర్‌తో స్టంప్స్ ఎగిరిపడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
(REUTERS)(2 / 6)
ఓలీ పోప్‍ను ఔట్ చేశాక.. అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లను తీసిన భారత పేసర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. అయితే, బుమ్రా వేసిన ఈ డెడ్లీ యార్కర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
(REUTERS)
(3 / 6)
సూపర్ యార్కర్‌తో పోప్‍ను బుమ్రా బౌల్డ్ చేసిన వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన నెటిజన్.. పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్‍ను ట్యాగ్ చేశారు. ఈ యార్కర్ ఎవరినైనా గుర్తు చేసిందా అని ప్రశ్నించారు.
(AFP)
(4 / 6)
దీనికి వకార్ యూనిస్ స్పందించాడు. బుమ్రా మ్యాజిక్ అంటూ ప్రశంసించాడు. “ఎవరూ గుర్తు రాలేదు. ఇది బుమ్రా మ్యాజిక్” అని వకార్ రిప్లై ఇచ్చాడు.
(PTI)
(5 / 6)
ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‍ను కుప్పకూల్చాడు బుమ్రా. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి.. భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.
(ANI )
(6 / 6)
రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‍లో మూడో టెస్టు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభం కానుంది.
(AFP)ఇతర గ్యాలరీలు