తెలుగు న్యూస్ / ఫోటో /
AP Wine Shop Tenders 2024 : వైన్ షాపుల లెసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు.. ఆ 2 దుకాణాలకే డిమాండ్ ఎక్కువ!
- AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు 57 వేల 709 దరఖాస్తులు వచ్చాయి. 9వ తేదీ ఒక్కరోజే 16 వేల 361 అందాయి. రూ. 1,154.18 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. దరఖాస్తుల గడువును రేపటి వరకు పొడిగించారు.
- AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు 57 వేల 709 దరఖాస్తులు వచ్చాయి. 9వ తేదీ ఒక్కరోజే 16 వేల 361 అందాయి. రూ. 1,154.18 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. దరఖాస్తుల గడువును రేపటి వరకు పొడిగించారు.
(1 / 6)
వైన్ షాపుల లెసెన్స్ కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే 57 వేల 709 దరఖాస్తులు వచ్చాయి. గురు, శుక్రవారాల్లో మరో 40 వేల వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ. 1,154.18 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(istockphoto)
(2 / 6)
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో రెండు దుకాణాలను నోటిఫై చేశారు. వాటిలో 96వ నంబరు దుకాణానికి 110, 97వ నంబరు దుకాణానికి 107 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కేవలం వీటి దరఖాస్తు రుసుము రూపంలోనే రూ. 4.22 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ పోటీ ఉన్నది ఈ దుకాణాలకే కావడం గమనార్హం. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(istockphoto)
(3 / 6)
ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాల లైసెన్స్ కోసం అత్యధికంగా 4 వేల 420 దరఖాస్తులు వచ్చాయి. తర్వాతి స్థానంలో ఏలూరు జిల్లాలో 144 దుకాణాలకు 3 వేల 843 దరఖాస్తులు అందాయి. మూడో స్థానంలో విజయనగరం జిల్లా ఉంది. ఇక్కడ 153 దుకాణాలకు 3 వేల 701 దరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 దుకాణాలకు 3 వేల 513 దరఖాస్తులు వచ్చాయి. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(istockphoto)
(4 / 6)
కొన్ని షాపులకు దరఖాస్తులు రావడం లేదు. 13 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తే వచ్చాయి. వాటిలో తిరుపతి జిల్లాలోనే 6 ఉన్నాయి. తిరుపతి జిల్లాలోని అత్యధిక శాతం షాపులకు 5 లోపు దరఖాస్తులే వచ్చాయి. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(istockphoto)
(5 / 6)
అనంతపురం జిల్లా పామిడిలోని 66వ నంబరు దుకాణం, బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని 66వ నంబరు దుకాణాలకు ఒక్కో దరఖాస్తు వచ్చాయి. చిత్తూరు జిల్లా సదుంలోని 101, 102 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు వచ్చాయి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని 98వ నంబరు, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని 81వ నంబరు దుకాణానికి ఒక్కో దరఖాస్తు అందాయి. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(istockphoto)
(6 / 6)
విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, కడప జిల్లాల్లో 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పల్నాడు, నంద్యాల, కృష్ణా, అల్లూరి, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, బాపట్ల, చిత్తూరు, పార్వతీపురం, కాకినాడ, జిల్లాల్లో తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(istockphoto)
ఇతర గ్యాలరీలు