High BP Symptoms: మీ బీపీ పెరిగితే ముఖంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి
High BP Symptoms: రక్తపోటు మీ గుండె ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీ బీపీ పెరిగితే మీ ముఖంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
(1 / 7)
అధిక రక్తపోటు గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి గుండెపోటు, పక్షవాతం కలిగిస్తుందని మీకు చాలా సార్లు తెలుసా.అయితే రక్తపోటు మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా.ఎలాగో తెలుసుకుందాం. (shutterstock)
(2 / 7)
అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ అంటారు.ఇది శరీరంలోని రక్త నాళాలను ప్రభావితం చేసే పరిస్థితి. దీర్ఘకాలిక అధిక రక్తపోటు రక్త నాళాల గోడలను దెబ్బతీస్తుంది, ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. (shutterstock)
(3 / 7)
అధిక రక్తపోటు వల్ల ముఖం ఎర్రబడుతుంది. అయితే కొన్నిసార్లు వ్యాయామం అధికంగా చేయడం, వేడి, మానసిక ఒత్తిడి, స్పైసీ ఫుడ్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ముఖం ఎర్రబడే అవకాశం ఉంది.(shutterstock)
(4 / 7)
దీర్ఘకాలంగా రక్తపోటు అధికంగా ఉండడం వల్ల చర్మం బలహీనంగా మారుతుంది. గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇటువంటి చర్మ గాయాలు నయం కావడానికి కూడా సమయం పడుతుంది. (shutterstock)
(5 / 7)
అధిక రక్తపోటు వల్ల ముఖంపై మొటిమలు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.(shutterstock)
(6 / 7)
అధిక రక్తపోటు సమస్య రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. చర్మానికి పోషకాలు, ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది, దీనివల్ల చర్మం డల్ గా, పొడిగా కనిపిస్తుంది. (shutterstock)
ఇతర గ్యాలరీలు