Kanya Puja: నవమినాడు ఇలా కన్యా పూజ చేస్తే దుర్గా దేవి ఆశీస్సులు లభిస్తాయి, ఎలా చేయాలో తెలుసుకోండి-if you do kanya puja on navami you will get the blessings of goddess durga know how to do it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kanya Puja: నవమినాడు ఇలా కన్యా పూజ చేస్తే దుర్గా దేవి ఆశీస్సులు లభిస్తాయి, ఎలా చేయాలో తెలుసుకోండి

Kanya Puja: నవమినాడు ఇలా కన్యా పూజ చేస్తే దుర్గా దేవి ఆశీస్సులు లభిస్తాయి, ఎలా చేయాలో తెలుసుకోండి

Oct 11, 2024, 06:00 AM IST Haritha Chappa
Oct 11, 2024, 06:00 AM , IST

  • Kanya Puja: కన్యా పూజ లేకుండా నవరాత్రి ఉపవాసం అసంపూర్ణం. ఎనిమిదో, తొమ్మిదో రోజున పదేళ్ల లోపు ఆడపిల్లలను ఇంటికి  కాళ్లు కడిగి తీపి పదార్ధాలు తినిపించాలి. వారికి బహుమతులు ఇచ్చి పంపాలి. అలాగే కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి.

నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల పాటు ఉంటాయి. ఇక్కడ దుర్గామాతను 9 విభిన్న రూపాలలో పూజిస్తారు. నవరాత్రల్లో చివరి రోజు నవమి నాడు చిన్నపిల్లలను దేవతలుగా పూజిస్తే మంచిది. దీన్నే కన్యా పూజా లేదా కొంజాక్ అని కూడా అంటారు.

(1 / 11)

నవరాత్రుల సమయంలో, భక్తులు నవమి తిథి నాడు కన్యా పూజ చేస్తారు. నవమి పర్వదినమైన అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం నాడు కన్యాపూజ చేయడం శ్రేయస్కరం.

(2 / 11)

కన్యాపూజ సమయంలో 2 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలను దుర్గామాతగా భావించి ఇంటికి ఆహ్వానించాలి. వారి కాళ్లు కడిగి పూరి,  హల్వా, కొబ్బరి ఆహారాలు తినిపించాలి. వారికి మనసుకు మెచ్చే బహుమతులను ఇచ్చి వీడ్కోలు పలకాలి. చిన్నారి ఆడపిల్లల్ని పూజిస్తే దుర్గామాతను ప్రసన్నం చేసుకుని ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.

(3 / 11)

 కన్యా పూజ సమయంలో దుర్గా దేవికి కోపం తెప్పించే ఏ తప్పూ చేయకూడదని గుర్తుంచుకోండి. కన్యా పూజ రోజున చిన్నారి పాపలకు అనేక బహుమతులు ఇవ్వాలి, తెలిసో తెలియకో దుర్గాదేవికి కోపం తెప్పించే గిఫ్ట్ ఇవ్వకండి. అమ్మాయిలకు బహుమతిగా ఏమి ఇవ్వకూడదో తెలుసుకోండి.  

(4 / 11)

కన్యా పూజ సమయంలో చిన్నపిల్లలకు బహుమతిగా స్టీల్ పాత్రలు లేదా ప్లాస్టిక్ వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే హిందూ మతంలో పూజ సమయంలో ఈ లోహాలను పవిత్రంగా పరిగణించరు.

(5 / 11)

అలాగే గాజు వస్తువులు లేదా పదునైన వస్తువులను ఇవ్వడం మానుకోండి.

(6 / 11)

అలాగే గాజు వస్తువులు లేదా పదునైన వస్తువులను ఇవ్వడం మానుకోండి.

కన్యాపూజ తర్వాత ఆడపిల్లలకు నల్లని దుస్తులు, నల్లని చేతి రుమాలు వంటివి ఇవ్వకూడదు. బదులుగా, మీరు ఎరుపు రంగు చున్రీ లేదా ఎరుపు డ్రెస్సులను బహుమతిగా ఇవ్వవచ్చు.

(7 / 11)

ఇంటికి వచ్చి నేరుగా బాలికలకు ఆహారం పెట్టే బదులు ముందుగా కాళ్లు కడిగి, బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంట్లో కూర్చోబెట్టాలి.

(8 / 11)

 వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా కేవలం హల్వా, పూరీ, శనగ, కొబ్బరి మాత్రమే ఇంటికి పిలిచిన చిన్నారులకు తినిపించాలి. చిన్నపిల్లలు తినగలిగినంత ఆహారం ఇవ్వండి.

(9 / 11)

 వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా కేవలం హల్వా, పూరీ, శనగ, కొబ్బరి మాత్రమే ఇంటికి పిలిచిన చిన్నారులకు తినిపించాలి. చిన్నపిల్లలు తినగలిగినంత ఆహారం ఇవ్వండి.(pixabay)

చిన్నారిని పూజించాక ఆమె కాళ్లకు నమస్కరించండి. లేకపోతే దుర్గామాతకు కోపం వస్తుంది.

(10 / 11)

చిన్నారిని పూజించాక ఆమె కాళ్లకు నమస్కరించండి. లేకపోతే దుర్గామాతకు కోపం వస్తుంది.

ఇంటికి వచ్చిన అమ్మాయిలు వెళ్లిన వెంటనే ఇంటిని శుభ్రం చేయకూడదు.

(11 / 11)

ఇంటికి వచ్చిన అమ్మాయిలు వెళ్లిన వెంటనే ఇంటిని శుభ్రం చేయకూడదు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు