Do Patti OTT Movie: తొలిసారి ఇలాంటి పాత్ర చేశా: కాజోల్.. మెరిసిన కృతి.. నేరుగా ఓటీటీలోకి దోపత్తి మూవీ
Do Patti OTT Movie Trailer launch: దోపత్తి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన కాజోల్, కృతి సనన్ ఈ ఈవెంట్‍లో తళుక్కుమన్నారు.
(1 / 6)
క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దోపత్తి' నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు కాజోల్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 14) జరిగింది. ఈ ఈవెంట్‍లో కాజోల్, కృతి జిగేల్‍మనిపించారు.
(2 / 6)
బ్రైట్ రెడ్ కలర్ లేస్ గౌన్‍ను కాజోల్ ధరించారు. తాను పోలిస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి అని కాజోల్ తెలిపారు. “నేను పోలీస్ ఆఫీసర్‌గా చేయడం తొలిసారి కావటంతో ఈ కొత్త అవతారంలో నన్ను ఫ్యాన్స్ చూసేందుకు వేచిచూడలేకున్నా” అని ఈ ఈవెంట్‍లో కాజోల్ అన్నారు.
(3 / 6)
కృతి సనన్ అట్రాక్టివ్ బ్లూ కలర్ డ్రెస్ ధరించారు. “నిర్మాతగా నాకు ఇది తొలి చిత్రం. తొలిసారి నేను డబుల్ రోల్ చేశా. ఇందులో ఒకటి చాలా ఛాలెంజింగ్ పాత్ర. చాలా స్పెషల్" అని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు కృతి. (Varinder Chawla)
(4 / 6)
కాజోల్, షాహిర్ షేక్, కృతిసనన్ కలిసి కెమెరాలకు ఫొజోలు ఇచ్చారు. ఈ మూవీలో షాహిర్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేశారు.
(5 / 6)
దో పత్తీ చిత్రానికి కనిక థిల్లాన్ కథ అందించగా.. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. థిల్లాన్‍తో పాటు కృతి కూడా ఈ మూవీకి ప్రొడ్యూజర్‌గా ఉన్నారు.
ఇతర గ్యాలరీలు