TS Rains : హైదరాబాద్ లో వడగండ్ల వాన, కరీంనగర్ లో వర్ష బీభత్సం
- TS Rains : తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
(2 / 6)
హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
(3 / 6)
మియాపూర్ లో వడగండ్ల వాన కురిసింది. మరో 3 గంటలు హైదరాబాద్ లో జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
(4 / 6)
మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి... ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.
(5 / 6)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
ఇతర గ్యాలరీలు