Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!-hyderabad metro second phase dpr is in final stage ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!

Sep 29, 2024, 05:31 PM IST Basani Shiva Kumar
Sep 29, 2024, 05:31 PM , IST

  • Hyderabad Metro : మెట్రో.. హైదరాబాద్ ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. నగరంలో ట్రాఫిక్ తగ్గడానికి కారణమైంది. ప్రజల నుంచి స్పందన కూడా బాగుంది. దీంతో మెట్రోను మరింత విస్తరించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో.. మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై.. సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో సమీక్షించారు. 

(1 / 5)

హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై.. సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో సమీక్షించారు. (@ltmhyd)

హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో రెండవ దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై ఆదివారం ప్రెజెంటేషన్ ఇచ్చారు. 

(2 / 5)

హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో రెండవ దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై ఆదివారం ప్రెజెంటేషన్ ఇచ్చారు. (@ltmhyd)

అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. 

(3 / 5)

అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. (@ltmhyd)

ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం.. మెట్రో సంస్థ ఎదురు చూస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

(4 / 5)

ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం.. మెట్రో సంస్థ ఎదురు చూస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.(@ltmhyd)

గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.

(5 / 5)

గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.(@ltmhyd)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు