రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?-how rohu fish can help reduce your risk of heart disease ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

Jul 19, 2023, 10:12 AM IST HT Telugu Desk
Jul 19, 2023, 10:13 AM , IST

  • Rohu Fish and Heart Health: రవ్వలు చేపల్లో ఒక రకం. ఇవి తినడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందట. ఇది నిజమా? సైన్స్ ఏం చెబుతోంది? ఇక్కడ తెలుసుకోండి.

రవ్వలు తెలుగు రాష్ట్రాల్లో లభించే సర్వసాధారణమైన రకం చేపలు. చవకైనవి కూడా. ఈ చేపలోని కొన్ని పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ చేపలో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక కొవ్వు ఉన్నవారు ఈ చేపను క్రమం తప్పకుండా తినవచ్చు.

(1 / 6)

అమెరికన్ స్కూల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం ఈ చేప అధిక రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది. హైబీపీ ఉన్న వారికి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

(2 / 6)

రవ్వ చేపల్లో విటమిన్ ఎ, డి, ఇ ఉంటాయి. అలాగే ఈ చేపలో కాల్షియం, జింక్, సోడియం, పొటాషియం, ఇనుము, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. రవ్వ చేపల్లో కోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ మూలకం నాడీ వ్యవస్థ, కొవ్వు జీవక్రియ, రక్త ప్రసరణలో సహాయపడుతుంది.

(3 / 6)

అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ చేప నిజంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందా? ఇందులో ఒమేగా త్రీ ఉండటం వల్ల రక్తపు అణువులు గడ్డకట్టకుండా అడ్డుకుంటుందని, తద్వారా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

(4 / 6)

కాడ్ ఫిష్ ఆయిల్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్), విఎల్‌డిఎల్‌లను తగ్గిస్తుంది.మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) మొత్తాన్ని పెంచుతుంది, తద్వారా గుండెలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. కాబట్టి ఈ చేపను తినడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందని చెప్పవచ్చు. 

(5 / 6)

మీరు ఈ చేపను ఎంత పరిమాణంలో తినవచ్చు? తగినమోతాదులో తినడం గురించి నిపుణులు నొక్కిచెబుతున్నారు. రోజూ 300 నుంచి 400 గ్రాముల రవ్వ చేపలు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు