AP TG Weather Updates : ఏపీలో మరో 3 రోజులు వానలు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు...!-heavy rains are likely in telangana from 7th july imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఏపీలో మరో 3 రోజులు వానలు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు...!

AP TG Weather Updates : ఏపీలో మరో 3 రోజులు వానలు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు...!

Published Jul 04, 2024 04:03 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 04, 2024 04:03 PM IST

  • AP Telangana Weather Updates : రుతుపవనాలు పూర్తిగా విస్తరించటంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండు మూడు రోజులు తేలికపాటి వర్షాలు ఉండగా.. జులై 7వ తేదీ నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉంది.

(1 / 6)

(image source from https://unsplash.com/)

రాబోయే ఐదు రోజులు తెలంగాణలో స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జులై 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

(2 / 6)

జులై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం(జులై 7) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు కురిసే ఛాన్స్‌ ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(3 / 6)

జులై 9వ తేదీ తర్వాత మళ్లీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

(4 / 6)

ఏపీలో చూస్తే…  యానాం, ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపోస్పిరక్ నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాంధ్రాతో పాటు సీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

(5 / 6)

జులై 8వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు