తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather ALERT : అల్పపీడనం ఎఫెక్ట్..! ఏపీకి 3 రోజులపాటు భారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు
- AP TG Weather Updates : ఏపీకి వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నవంబర్ 12 నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వానలు పడనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. .దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు ఈ వివరాలను పేర్కొంది.
(2 / 7)
తదుపరి రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని ఐఎండీ తెలిపింది .ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తాజా బులెటిన్ లో వెల్లడించింది.
(3 / 7)
దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(4 / 7)
ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో వరికోతలు,ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
(5 / 7)
ఇక తెలంగామలో నవంబర్ 12వ తేదీ నుంచి తేలికపాటి లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(6 / 7)
ఇవాళ్టి నుంచి నవంబర్ 11వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదని అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు