Google Pixel 9 series: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల లోని 5 కొత్త ఏఐ ఫీచర్లు ఇవే
Google Pixel 9 series: పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను గూగుల్ భారత్ లో ఆవిష్కరించింది. ఈ సిరీస్ లో ఒక ఫోల్డబుల్ ఫోన్ సహా 4 స్మార్ట్ ఫోన్స్ ను గూగుల్ లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల లో అత్యాధునిక కృత్రిమ మేథ ఫీచర్స్ ను పొందుపర్చింది. ఆ వివరాలను ఇక్కడ చూద్దాం..
(1 / 5)
జెమినీ లైవ్: ఆండ్రాయిడ్ డివైజ్ ల కోసం గూగుల్ కొత్త ఏఐ ఆధారిత మొబైల్ అసిస్టెంట్ ను లాంచ్ చేసింది. ఇది వాయిస్ ప్రాంప్ట్ లపై పనిచేస్తుంది. ఇది వినియోగదారులతో పూర్తిగా మనుషుల తరహాలోనే సంభాషించగలదు. అదనంగా, జెమిని లైవ్ అనేక గూగుల్ యాప్స్ తో అనుసంధానమై ఉంటుంది, కాబట్టి వినియోగదారులు రిమైండర్ సెట్ చేయడం లేదా జీమెయిల్, ఫోటోలు లేదా వీడియోల నుండి సమాచారాన్ని సంగ్రహించడం వంటి సంక్లిష్ట పనులను నిర్వహించడానికి జెమిని సహకారం తీసుకోవచ్చు.(Google)
(2 / 5)
పిక్సెల్ స్టూడియో: ప్రస్తుతం పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్న కొత్త ఏఐ ఆధారిత యాప్ ఇది. ఇది టెన్సర్ జీ 4, ఇమేజెన్ 3 టెక్స్ట్-టు-ఇమేజ్ మోడల్ ద్వారా నడిచే ఇమేజ్ జనరేటర్ టూల్, దీంతో ఫొటోలకు స్టైల్ చేంజెస్ చేయవచ్చు. స్టైల్ చేంజెస్ తో కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేయవచ్చు. ప్రాంప్ట్ లను ఉపయోగించి వ్యక్తిగత స్టిక్కర్లు, ఇన్విటేషన్ కార్డుల్లో మార్పులు చేయవచ్చు.(Google)
(3 / 5)
పిక్సెల్ స్క్రీన్ షాట్స్: ఇది కొత్త పిక్సెల్ 9 సిరీస్ యాప్, ఇది ఫొటోలు, వీడియోల నుండి నిర్దిష్ట సమాచారాన్ని సేవ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, రీకాల్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అడ్రెస్ లు, బ్రౌజ్ చేసిన షాపింగ్ ఐటమ్స్, మరెన్నో స్క్రీన్ షాట్ల నుండి సమాచారాన్ని పొందవచ్చు. యూజర్లు సెర్చ్ ట్యాబ్ లో ప్రాంప్ట్ టైప్ చేస్తే సరిపోతుంది.(Google)
(4 / 5)
కస్టమ్ వెదర్ రిపోర్ట్స్: పిక్సెల్ 9 యూజర్ల కోసం గూగుల్ వెదర్ యాప్ ను రీడిజైన్ చేసింది. ఇప్పుడు ఇది కొన్ని కొత్త ఏఐ ఫీచర్లతో వస్తుంది. యూజర్ అవసరాల ఆధారంగా మొత్తం రోజు గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి కస్టమైజ్డ్ వెదర్ రిపోర్టులను జనరేట్ చేయడానికి యాప్ జెమినీ నానోను ఉపయోగిస్తుంది.(Google)
(5 / 5)
కాల్ నోట్స్: ఇది గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్స్ లో ఉన్న మరో ఉపయోగకరమైన ఏఐ ఫీచర్. దీంతో మీ కాల్ లో ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశాల ట్రాన్స్ క్రిప్షన్స్ పొందవచ్చు. ఇది ఏఐ ఆధారిత ఆన్-డివైజ్ ఫీచర్, ఇది వినియోగదారులు కాల్ చేసేటప్పుడు వారి గోప్యతను కాపాడుతుంది. అపాయింట్మెంట్ సమయం, ముఖ్యమైన చిరునామా లేదా ఫోన్ నంబర్ వంటి సమాచారం కావాలంటే కాల్ నోట్స్ ను ఆన్ చేస్తే, అన్ని వివరాలు, ట్రాన్స్క్రిప్ట్ కాల్ లాగ్ లో లభిస్తాయి.(Google)
ఇతర గ్యాలరీలు