Godavari Floods In Pics: మహోగ్ర రూపంతో గోదావరి పరవళ్లు… రెండో నంబరు హెచ్చరికకు చేరువలో వరద-godavari overflows with furious form flood nearing warning number two ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Godavari Floods In Pics: మహోగ్ర రూపంతో గోదావరి పరవళ్లు… రెండో నంబరు హెచ్చరికకు చేరువలో వరద

Godavari Floods In Pics: మహోగ్ర రూపంతో గోదావరి పరవళ్లు… రెండో నంబరు హెచ్చరికకు చేరువలో వరద

Published Jul 22, 2024 02:46 PM IST Sarath chandra.B
Published Jul 22, 2024 02:46 PM IST

  • Godavari Floods In Pics: గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. రెండో నంబరు ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటి మట్టం చేరింది. దీంతో ఏపీ, తెలంగాణల్లో పలు గ్రామాలు ముంపు ముప్పులో చిక్కుకున్నాయి. 

గోదావరి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న విపత్తు సహాయక దళాలు

(1 / 8)

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఖమ్మం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. 

(2 / 8)

స్పిల్‌ ఛానల్‌ మీదుగా, స్పిల్‌ వే రేడియల్‌ గేట్లనుంచి పరవళ్లతో ప్రవహిస్తున్న గోదావరి

(3 / 8)

ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున విపత్తు సహాయక బృందాలను తరలించారు. 

(4 / 8)

భద్రాచలం బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి నది

(5 / 8)

భద్రాచలం బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి నది

పోలవరం స్పిల్‌ వే గేట్లను తాకేలా వర ప్రవాహం సాగుతోంది. అటు ఎగువ కాఫర్ డ్యామ్‌‌కు చేరువలో వరద ప్రవాహం ఉంది.దిగువ కాఫర్‌ డ్యామ్‌కు కూడా  నీరు చేరుతోంది. 

(6 / 8)

ఏజెన్సీ ప్రాంతాల్లో వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లో చిక్కుకున్న వారిని విపత్తు సహాయక దళాలు  సహాయ శిబిరాలకు తరలిస్తున్నాయి. 

(7 / 8)

భద్రాచలం రామాలయం వద్ద గోదావరి ఘాట్‌కు చేరిన వరద ప్రవాహం

(8 / 8)

ఇతర గ్యాలరీలు