Thick Long Hair । నల్లటి, ఒత్తైన కురులు కావాలనుకుంటే.. ఈ ఒక్క చిట్కా పాటించండి!-follow this tip to grow your hair much thicker and longer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Thick Long Hair । నల్లటి, ఒత్తైన కురులు కావాలనుకుంటే.. ఈ ఒక్క చిట్కా పాటించండి!

Thick Long Hair । నల్లటి, ఒత్తైన కురులు కావాలనుకుంటే.. ఈ ఒక్క చిట్కా పాటించండి!

Nov 15, 2022, 10:00 PM IST HT Telugu Desk
Nov 15, 2022, 10:00 PM , IST

Thick Long Hair: నల్లటి, ఒత్తైన కురులు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అబ్బాయిలకు కూడా వాలు జడ ఉన్న అమ్మాయిలంటేనే ఎక్కువ ఇష్టం. మరి ఒత్తైన శిరోజాలు పొందాలంటే ఏం చేయాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, చూడండి.

నడుము వరకు నల్లటి పొడవాటి జుట్టు కలిగి జడవేసుకొని, చీర కట్టుకొని అమ్మాయి నడిచొస్తుంటే ఆ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అలాంటి కలను నిజం చేసుకోవాలంటే. జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలను అరికట్టాలి. దీనికి పరిష్కార మార్గం ఇక్కడ ఉంది.

(1 / 5)

నడుము వరకు నల్లటి పొడవాటి జుట్టు కలిగి జడవేసుకొని, చీర కట్టుకొని అమ్మాయి నడిచొస్తుంటే ఆ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అలాంటి కలను నిజం చేసుకోవాలంటే. జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలను అరికట్టాలి. దీనికి పరిష్కార మార్గం ఇక్కడ ఉంది.(Pixabay)

మెంతులు, నల్ల నువ్వులు, కరివేపాకు, పెరుగు అన్నీ కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ వెంట్రుకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతులు, నల్ల నువ్వుల బాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని ఒక గిన్నెలో వేసి, దానికి పెరుగును కలపాలి. ఈ పేస్టును మీ జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండాలి.

(2 / 5)

మెంతులు, నల్ల నువ్వులు, కరివేపాకు, పెరుగు అన్నీ కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ వెంట్రుకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతులు, నల్ల నువ్వుల బాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని ఒక గిన్నెలో వేసి, దానికి పెరుగును కలపాలి. ఈ పేస్టును మీ జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండాలి.(Unsplash)

మెంతులు- నల్ల నువ్వుల పొడిని రోజూ కొబ్బరినూనెతో కలిపి రాసుకోవచ్చు. 15-20 నిమిషాల తర్వాత తేలికైన షాంపూ ఉపయోగించి కడిగేసుకోవాలి.

(3 / 5)

మెంతులు- నల్ల నువ్వుల పొడిని రోజూ కొబ్బరినూనెతో కలిపి రాసుకోవచ్చు. 15-20 నిమిషాల తర్వాత తేలికైన షాంపూ ఉపయోగించి కడిగేసుకోవాలి.

మెంతులు- నల్ల నువ్వుల పొడిని పైన సూచించిన విధంగా జుట్టుకు అప్లై చేస్తూ ఉండటం ద్వారా జుట్టు రాలడం తగ్గి, నల్లని ఒత్తైన కురులు పొందుతారు. జుట్టు కూడా మృదువుగా ఉంటుంది.

(4 / 5)

మెంతులు- నల్ల నువ్వుల పొడిని పైన సూచించిన విధంగా జుట్టుకు అప్లై చేస్తూ ఉండటం ద్వారా జుట్టు రాలడం తగ్గి, నల్లని ఒత్తైన కురులు పొందుతారు. జుట్టు కూడా మృదువుగా ఉంటుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు