తెలుగు న్యూస్ / ఫోటో /
Stronger knees: బలమైన మోకాళ్లు, జాయింట్స్ కోసం ఈ ఎక్సర్ సైజెస్ రెగ్యులర్ గా చేయండి..
Osteoarthritis: వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్లు బలహీనమవుతాయి. మోకాళ్లను స్ట్రాంగ్ గా చేసుకోవడానికి, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎక్సర్ సైజెస్ చేయండి..
(1 / 7)
మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు ఉత్తమమైన చికిత్సలలో వ్యాయామం ఒకటి. ఎందుకంటే ఇది నొప్పిని తగ్గిస్తుంది, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామాలు చేయడం ద్వారా మోకాళ్లను మరింత బలోపేతం చేసుకోవచ్చు. (Twitter/JWatch)
(2 / 7)
నడక: సింపుల్ ఎక్సర్ సైజ్ వాకింగ్. ప్రతీ రోజు నిర్ణీత సమయం వాకింగ్ చేయడం ద్వారా మోకాళ్ల నొప్పి తగ్గుతుంది. దాంతో పాటు ఫిట్ నెస్ కూడా మెరుగుపడుతుంది. (Unsplash)
(3 / 7)
సైక్లింగ్: సైక్లింగ్ వల్ల మోకాలి కీలు చుట్టూ ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. అలాగే, సైక్లింగ్ తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.(Unsplash)
(4 / 7)
యోగా: యోగాతో సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుంది. కొన్ని యోగాసనాలను రెగ్యులర్ గా వేయడం ద్వారా మోకాళ్లు, జాయింట్స్ బలోపేతమవుతాయి. (Unsplash)
(5 / 7)
కొన్ని స్ట్రెంథ్ ఎక్సర్ సైజెస్ మోకాలి చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తాయి. తద్వారా మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది.(Shutterstock)
(6 / 7)
నెమ్మదిగా ప్రారంభించి, క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచడం చాలా ముఖ్యం. అసౌకర్యంగా అనిపిస్తే వ్యాయామం చేయడం మానేయాలి. అయితే, ఏదైనా కొత్త వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.(Shutterstock )
ఇతర గ్యాలరీలు