తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Cafe Bahar Biryani : మూతపడిన 50 ఏళ్ల నాటి ‘కేఫ్ బహార్’…! పరేషాన్ లో బిర్యానీ లవర్స్
- బిర్యానీకి హైదరాబాద్ చాలా ఫేమస్! అందులోనూ కొన్ని రెస్టారెంట్లకు తిరుగులేదు. పక్కాగా అక్కడికి వెళ్లి తినాల్సిందే అన్నట్లు ఉంటుంది. అందులో ఒకటి కేఫ్ బహార్. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రెస్టారెంట్ తాజాగా మూతపడింది. యాజమాన్యంలోని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
- బిర్యానీకి హైదరాబాద్ చాలా ఫేమస్! అందులోనూ కొన్ని రెస్టారెంట్లకు తిరుగులేదు. పక్కాగా అక్కడికి వెళ్లి తినాల్సిందే అన్నట్లు ఉంటుంది. అందులో ఒకటి కేఫ్ బహార్. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రెస్టారెంట్ తాజాగా మూతపడింది. యాజమాన్యంలోని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
(1 / 6)
హైదరాబాద్ పేరు వింటే చాలు ఫుడ్ లవర్స్ అందరికీ దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇక హైదరాబాదీల వీకెండ్ మెనూ కార్డ్‌లో ముక్క ఉండి తీరాల్సిందే. వరల్డ్ వైడ్ గా కూడా మన బిర్యానీకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది.నగరంలోని ఏ గల్లీకి వెళ్లిన హోటళ్లలో బిర్యానీ దొరుకుతుంటుంది. (image source from Cafe Bahar FB Page)
(2 / 6)
హైదరాబాద్ నగరంలో ఎన్నో బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నప్పటికీ… కొన్ని ప్లేసులకు మాత్రం తిరుగులేని పేరుంది. నగరంలో బిర్యానీకి 10 - 15 టాప్ రెస్టారెంట్లు ఉండగా.. అందులో ఒకటి కేఫ్ బహార్. ఇది హైదర్ గూడలో ఉంటుంది.
(3 / 6)
కేఫ్ బహార్ కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. దీన్ని 1973లో స్థాపించారు. ఇప్పటికి 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. తొలినాళ్లలో ఇరానీ ఛాయ్ స్టాల్‌తో ప్రారంభమైన ఈ ప్లేస్…ఆ తర్వాత బిర్యానీ సెంటర్ గా మారిపోయింది. ఇప్పటికీ ఇక్కడ దొరికే ఇరానీ చాయ్ చాలా స్పెషల్. (image source from Cafe Bahar FB Page)
(4 / 6)
నిత్యం జనాలతో కిటకిటలాడే ఈ రెస్టారెంట్.. కొద్దిరోజులుగా ఓపెన్ కావటం లేదు. దాదాపు పది రోజులు దాటిపోయింది. ఆ ప్రాంతమంతా కూడా బోసిపోయినట్లుగా మారిపోయింది. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన ఆస్తి తగాదాలే మూసివేతకు కారణమని తెలుస్తోంది.
(5 / 6)
హుస్సేన్ బొలూకి అనే వ్యక్తి కేఫ్ బహార్ ను స్థాపించారు. మొదట్లో ఇరానీ చాయ్ మాత్రం దొరికేది. తర్వాత రెస్టారెంట్ స్థాయికి ఎదిగింది. కరోనా సమయంలో యాజమాని చనిపోవటంతో… ఫ్యామిలిలో ఆస్తి తగాదాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేఫ్ తాళాలతో దర్శనమిస్తోంది. అయితే త్వరలోనే కేఫ్ బహార్ ఓపెన్ అవుతోందని తెలుస్తోంది. (image source from Cafe Bahar FB Page)
ఇతర గ్యాలరీలు