Move on after a breakup: బ్రేకప్ తరువాతి బాధ తగ్గించుకోండిలా..-effective ways to move on after a break up ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Move On After A Breakup: బ్రేకప్ తరువాతి బాధ తగ్గించుకోండిలా..

Move on after a breakup: బ్రేకప్ తరువాతి బాధ తగ్గించుకోండిలా..

Apr 25, 2023, 07:00 AM IST HT Lifestyle Desk
Apr 25, 2023, 07:00 AM , IST

Move on after a breakup: బ్రేకప్ తట్టుకోవడం సులభం కాదు.  స్నేహపూర్వకంగా విడిపోయినా, గొడవలతో దూరమైనా దాని నుంచి బయటకు రావడం కష్టమే. కొన్ని సలహాలు తెలుసుకుంటే మీరు ఆ బాధ నుంచి బయటపడటం సులువుతుంది. 

బ్రేకప్ బాధ నుంచి బయటకు రావడం కష్టమే. కానీ మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటూ, మీ పక్కన వారి సహాయం కోరుతూ, మీ వ్యక్తిగత ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. దానివల్ల జరిగింది మర్చిపోవడంతో పాటూ మీరు కూడా మానసికంగా దృఢంగా మారతారు. 

(1 / 8)

బ్రేకప్ బాధ నుంచి బయటకు రావడం కష్టమే. కానీ మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటూ, మీ పక్కన వారి సహాయం కోరుతూ, మీ వ్యక్తిగత ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. దానివల్ల జరిగింది మర్చిపోవడంతో పాటూ మీరు కూడా మానసికంగా దృఢంగా మారతారు. (pixabay)

చురుకుగా ఉండండి: ఒకే దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటే బాధ పెరుగుతుంది. వీలైనంత వరకు బయటకు వెళ్లడం, వ్యాయామం చెయ్యడానికే ప్రయత్నించండి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శారీరక మైన నొప్పినే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. 

(2 / 8)

చురుకుగా ఉండండి: ఒకే దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటే బాధ పెరుగుతుంది. వీలైనంత వరకు బయటకు వెళ్లడం, వ్యాయామం చెయ్యడానికే ప్రయత్నించండి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శారీరక మైన నొప్పినే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. (Freepik)

2.స్నేహితులను కలవండి:  ఒంటరిగా ఉండకండి. స్నేహితులతో ఉండండి. వాళ్లతో కలిసి గడపండి. ఈ సమయంలో మీ కన్నీళ్లు తుడవడానికీ, మీ బాధను చెప్పుకోడానికి స్నేహితులకన్నా సౌకర్యాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. 

(3 / 8)

2.స్నేహితులను కలవండి:  ఒంటరిగా ఉండకండి. స్నేహితులతో ఉండండి. వాళ్లతో కలిసి గడపండి. ఈ సమయంలో మీ కన్నీళ్లు తుడవడానికీ, మీ బాధను చెప్పుకోడానికి స్నేహితులకన్నా సౌకర్యాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. (Unsplash)

3: కొత్త అభిరుచి: మీ శక్తిని సృజనాత్మకత మీదికి మళ్లించడం వలన మీరు మీ బాధ మర్చిపోతారు. పెయింటింగ్ లేదా గార్డెనింగ్ వంటి కొత్త హాబీ ఏదైనా మొదలు పెట్టండి.  లేదా మీ బెడ్‌రూమ్‌ని అలంకరించడం, మీ వార్డ్‌రోబ్ సర్దుకోవడం.. ఇలా మీకిష్టమైన పని మీ మనసు పెట్టి చేయండి.

(4 / 8)

3: కొత్త అభిరుచి: మీ శక్తిని సృజనాత్మకత మీదికి మళ్లించడం వలన మీరు మీ బాధ మర్చిపోతారు. పెయింటింగ్ లేదా గార్డెనింగ్ వంటి కొత్త హాబీ ఏదైనా మొదలు పెట్టండి.  లేదా మీ బెడ్‌రూమ్‌ని అలంకరించడం, మీ వార్డ్‌రోబ్ సర్దుకోవడం.. ఇలా మీకిష్టమైన పని మీ మనసు పెట్టి చేయండి.(Pixabay)

4. మీ భావోద్వేగాలను అంగీకరించండి: బాధ, కోపం, విచారం ఇలా ఏదైనా సరే..   బ్రేకప్ తో వచ్చే అన్ని భావోద్వేగాలను అర్థం చేసుకోండి. వాటిని అనుభవించడానికి మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోవాల్సిందే.  దానివల్ల వీలైనంత తొందరగా ఈ బాధ నుంచి బయటపడగలరు.

(5 / 8)

4. మీ భావోద్వేగాలను అంగీకరించండి: బాధ, కోపం, విచారం ఇలా ఏదైనా సరే..   బ్రేకప్ తో వచ్చే అన్ని భావోద్వేగాలను అర్థం చేసుకోండి. వాటిని అనుభవించడానికి మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోవాల్సిందే.  దానివల్ల వీలైనంత తొందరగా ఈ బాధ నుంచి బయటపడగలరు.(Freepik)

5. మిమ్మల్ని మీరే ఆనంద పరుచుకోండి:  మీకు మీరే ప్రత్యేకంగా ఏదైనా చేసుకోండి. కొత్త బట్టలు కొనుక్కోవడం, మంచి మర్దనా, లేదంటే వేడి నీటి స్నానం.. ఇలా మీకు సంతోషాన్నిచ్చే పనుల వల్ల కాస్త ఊరట ఉంటుంది. భవిష్యత్తు మీద సానుకూల అబిప్రాయంతో ముందుకు కదులుతారు.

(6 / 8)

5. మిమ్మల్ని మీరే ఆనంద పరుచుకోండి:  మీకు మీరే ప్రత్యేకంగా ఏదైనా చేసుకోండి. కొత్త బట్టలు కొనుక్కోవడం, మంచి మర్దనా, లేదంటే వేడి నీటి స్నానం.. ఇలా మీకు సంతోషాన్నిచ్చే పనుల వల్ల కాస్త ఊరట ఉంటుంది. భవిష్యత్తు మీద సానుకూల అబిప్రాయంతో ముందుకు కదులుతారు.(Shutterstock)

6. స్వీయ-సంరక్షణ : బ్రేకప్‌లు మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా హరించేస్తాయి. తగినంత నిద్ర పోవడం, బాగా తినడం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.  రాబోయే విజయాలను, సవాళ్లను సమానంగా ఎదుర్కోడానికి మీరు సిద్ధంగా ఉండాలి.  

(7 / 8)

6. స్వీయ-సంరక్షణ : బ్రేకప్‌లు మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా హరించేస్తాయి. తగినంత నిద్ర పోవడం, బాగా తినడం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.  రాబోయే విజయాలను, సవాళ్లను సమానంగా ఎదుర్కోడానికి మీరు సిద్ధంగా ఉండాలి.  (Twitter/MindfulOnline)

7. వైద్య సహాయం తీసుకోండి: మీకు బ్రేకప్ నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటే.. మీవల్ల కాదనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ప్రొఫెషనల్ కౌన్సిలర్ లేదా థెరపిస్టును కలవండి. దానివల్ల మీరు ఇంకాస్త తొందరగా మామూలు మనిషవుతారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ ముందడుగు వేయగలుగుతారు.

(8 / 8)

7. వైద్య సహాయం తీసుకోండి: మీకు బ్రేకప్ నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటే.. మీవల్ల కాదనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ప్రొఫెషనల్ కౌన్సిలర్ లేదా థెరపిస్టును కలవండి. దానివల్ల మీరు ఇంకాస్త తొందరగా మామూలు మనిషవుతారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ ముందడుగు వేయగలుగుతారు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు