Cinema Chettu : 150 ఏళ్ల చరిత్ర, 300 సినిమాల షూటింగ్స్-నేలకొరిగిన సినిమా చెట్టు-east godavari kovvur cinema tree collapsed in godavari flood water effect ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cinema Chettu : 150 ఏళ్ల చరిత్ర, 300 సినిమాల షూటింగ్స్-నేలకొరిగిన సినిమా చెట్టు

Cinema Chettu : 150 ఏళ్ల చరిత్ర, 300 సినిమాల షూటింగ్స్-నేలకొరిగిన సినిమా చెట్టు

Aug 06, 2024, 02:30 PM IST Bandaru Satyaprasad
Aug 06, 2024, 02:30 PM , IST

  • Cinema Chettu : 150 ఏళ్ల సినిమా చెట్టు నేలకొరిగింది. సుమారు 300 సినిమాల్లో చాలా సన్నివేశాల్లో కనిపించిన ఈ మహా వృక్షం గోదావరిలో కూలిపోయింది. గోదావరి ఒడ్డున 150 ఏళ్ల పాటు ఎన్నో జీవులకు నీడ నిచ్చిన చెట్టు గోదావరి కోతతో నీటిలో ఒరిగిపోయింది.

150 ఏళ్ల సినిమా చెట్టు నేలకొరిగింది. సుమారు 300 సినిమాల్లో చాలా సన్నివేశాల్లో కనిపించిన ఈ మహా వృక్షం గోదావరిలో కూలిపోయింది. గోదావరి ఒడ్డున 150 ఏళ్ల పాటు ఎన్నో జీవులకు నీడ నిచ్చిన చెట్టు గోదావరి కోతతో నీటిలో ఒరిగిపోయింది. 

(1 / 6)

1975లో విడుదలైన పాడిపంటలు సినిమా నుంచి రామ్ చరణ్ రంగస్థలం వరకు ఎన్నో వందల సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది. గోదావరి ఒడ్డునున్న ఈ చెట్టు వద్ద సినిమా సీన్ తీస్తే హిట్టు పక్కా అనే నమ్మకం స్థానికంగా ఉంది.  

(2 / 6)

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి నది ఒడ్డునున్న 150 ఏళ్ల చరిత్ర కలిగిన మహా వృక్షం కూలిపోయింది. సుమారు 300లకు పైగా సినిమాల్లోని సన్నివేశాలు ఈ చెట్టు నీడలో తీశారు.  ఈ చెట్టును స్థానికంగా సినిమా చెట్టు అని పిలుస్తుంటారు. 

(3 / 6)

నిర్మాతలకు, దర్శకులకు వారి సినిమాలో ఈ చెట్టును చూపిస్తే ఈ మూవీ హిట్ అవుతుందన్న ఒక నమ్మకం ఉండేది. వందలాది సినిమాల్లోని సన్నివేశాలు, పాటలు ఇక్కడ తీశారు.  మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు సినిమాల్లో ఈ చెట్టు కనిపిస్తుంది. 

(4 / 6)

అలనాటి దర్శనకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ సినిమా చెట్టు స్పాట్ చాలా ఇష్టం. వారి సినిమాల్లో కనీసం ఒక్క సీన్ అయినా ఈ చెట్టు వద్ద తీసేవారు. డైరెక్టర్ వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారంట. 

(5 / 6)

గోదావరి వరద ఉద్ధృతికి ఈ చెట్టు కూలిపోయింది. దీంతో స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు